Rome Masters : భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న (Rohan Bopanna)కు చుక్కెదురైంది. రోమ్ మాస్టర్స్ (Rome Masters) రెండో రౌండ్లో అదరగొట్టిన బోపన్న, ఆడమ్ పవ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జోడీ.. అనూహ్యంగా మూడో రౌండ్లో ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో బ్రిటన్కు చెందిన జో సలిబరీ, నీల్ స్కూపస్కీ ద్వయం.. బోపన్న జంటకు చెక్ పెట్టింది.
గంట 8 నిమిషాల పాటు సాగిన పోరులో బ్రిటన్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. దాంతో, వరుస సెట్లలో వెనకబడిన బోపన్న, ఆడమ్ 3-6, 3-6తో మ్యాచ్ చేజార్చుకున్నారు. బోపన్న ఇంటిదారి పట్టడంతో ఈ టోర్నీ భారత పోరాటం ముగిసింది.
India’s Rohan Bopanna 🇮🇳and Adam Pavlasek of Czech Republic🇨🇿 exited the Rome Masters after a 3-6, 3-6 loss to British pair Joe Salisbury 🇬🇧 and Neal Skupski🇬🇧 in the round of 16. pic.twitter.com/jW3LWksGbx
— Asian Tennis Federation (@asian_tennis) May 13, 2025
ఈ టోర్నీలో భారత యువ ఆటగాడు యుకీ బాంబ్రీ (Yuki Bhambri) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. అమెరికా ప్లేయర్ రాబర్ట్ గాల్లొవేతో బరిలోకి దిగిన బాంబ్రీ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగో సీడ్ మార్సెల్ గ్రానొల్లెర్స్(స్పెయిన్), హొరాసియో జెబల్లోస్(అర్జెంటీనా) ద్వయం జోరు ముందు నిలవలేకపోయారు. దాంతో బాంబ్రీ, రాబర్ట్ జోడీకి 1-6, 2-6తో ఓటమి తప్పలేదు.