French Open 2025 : టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2025)కు కౌంట్‌డౌన్ మొదలైంది. పారిస్ వేదికగా మే 25న ఎర్రమట్టి కోర్టులో టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు స్టాన్ వావ్రింకా (Stan Wawrinka), రిచర్డ్ గాస్కెట్ (Richard Gasquet) పోటీపడనున్నారు. టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (Jannki Sinner), అలెగ్జాండర్ జ్వెరెవ్, కార్లోస్ అల్కరాజ్.. వంటి కుర్రాళ్లకు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. మూడుసార్లు ఛాంపియన్ గాస్కెట్, వెటరన్ ప్లేయర్ వావ్రింకాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. వీళ్లతో మరో ఏడుగురు పురుషుల సింగిల్స్‌లో వైల్డ్ కార్డు ద్వారా ఆడనున్నారు.
ఈ ఏడాది మార్చిలో వావ్రింకా 40ల్లో అడుగుపెట్టాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ 2015లో ఫ్రెంచ్ ఓపెనర్, 2016లో యూఎస్ ఓపెన్ విజేతగా అవతరించాడు. అయితే.. ఈమధ్య తరచూ గాయల బారిన పడిన వావ్రింకా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 132వ స్థానానికి పడిపోయాడు. 38 ఏళ్ల గాస్కెట్ విషయానికొస్తే అతడికి బహుశా ఇదే చివరి ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు. 2007లో ఇతడు కెరియర్ బెస్ట్‌గా 7వ ర్యాంక్ సాధించాడు.
🚨 OFFICIEL ! LES WILD-CARDS POUR ROLAND-GARROS ! 🇫🇷
🇫🇷 Valentin ROYER
🇫🇷 Arthur CAZAUX
🇫🇷 Richard GASQUET
🇫🇷 Terence ATMANE
🇫🇷 Pierre-Hugues HERBERT
🇨🇭 Stan WAWRINKA
🇺🇸 Emiliano NAVA
🇦🇺 Tristan SCHOOLKATE pic.twitter.com/0nOHsKz11H— Avantage Tennis 🎾 (@AvantageTennis_) May 13, 2025
పురుషుల సింగిల్స్ వైల్డ్ కార్డ్ – స్టాన్ వావ్రింకా(స్విట్జర్లాండ్), ట్రిస్టన్ స్కూల్‌కేట్(ఆస్ట్రేలియా), టెరెన్సే అట్మానే, అర్థర్ సెజాక్స్, రిచర్డ్ గాస్కెట్, వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్), ఎమిలియో నవ(అమెరికా).
మహిళల సింగిల్స్‌లో వైల్డ్ కార్డ్ – డెస్టానీ ఐవా(ఆస్ట్రేలియా), లాయిస్ బాయిసన్, ఎల్సా జాకెమట్, చ్లో ప్లాకెట్, లీయోలియా జీనజీన్, (ఫ్రాన్స్), ఇవా జోవిక్ (అమెరికా).
Simplemente, Stan the man en Bordeaux 👏#ATPChallenger | @stanwawrinkapic.twitter.com/H6NgfEu2yF
— ATP Tour en Español (@ATPTour_ES) May 13, 2025
ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటలీ కెరటం జన్నిక్ సిన్నర్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. అతడికి రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్, నిరుడు రన్నరప్ కార్లోస్ అల్కరాజ్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది. అమెరికా సంచలనం టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) సైతం ఈ ముగ్గురికి సవాల్ విసిరడం ఖాయం. మహిళల విభాగంలో నంబర్ 1 అరీనా సబలెంక, ఇగా స్వియాటెక్, అమెరికా టీనేజర్ కొకో గాఫ్, జెస్సికా పెగులా, జాస్మినె పౌలోనీల మధ్యనే పోటీ ఉండనుంది.