సంస్థాన్ నారాయణపురం, మే 13 : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి బైపీసీ, ఎంపీసీ విభాగంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లింగస్వామి మంగళవారం తెలిపారు. ఈ నెల 15వ తేదీన మిర్యాలగూడలోని అవంతిపురం గిరిజన గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు పదో తరగతి మార్కుల మెమో, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్, మూడు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కౌన్సిలింగ్ హాజరు కావాలని సూచించారు.