IPL 2025 : ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మేటి జట్టే. కానీ, ఇప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి అందని ద్రాక్షనే. ఏకంగా మూడుసార్లు ఫైనల్ చేరినా టైటిల్‌ను మాత్రం ముద్దాడలేదు. టీమ్ నిండా హిట్టర్లు, విధ్వంసక ఆటగాళ్లు.. నిఖార్సైన పేసర్లు ఉన్నా సరే.. ఎందుకనో ఆర్సీబీని దురదృష్టం వెంటాడుతూ వస్తోంది. అయినా సరే నిరాశ చెందకుండా ఈ సాలా కప్ నమదే అనే స్లోగన్‌తో బరిలోకి దిగుతోందా జట్టు. చూస్తుంటే.. 18వ ఎడిషన్‌లో ఆ జట్టు కల సాకారమయ్యేలా ఉంది.
18వ ఎడిషన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లో అదరగొడుతున్న రజత్ పాటిదార్ బృందం వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి అగ్రస్థానం సాధించింది. ప్రస్తుతం 14 పాయింట్లతో టాప్‌లో ఉన్న ఆర్సీబీ తదుపరి నాలుగు మ్యాచుల్లో రెండు గెలిచినా ప్లే ఆఫ్స్ ఆడడం పక్కా.
THIS. IS. HOW. WE. PLAY. BOLD. 🧿❤ pic.twitter.com/vFe1uKuDXX
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 28, 2025
ఐపీఎల్ ట్రోఫీ కోసం 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బెంగళూరు 18వ ఎడిషన్‌లో చెలరేగి ఆడుతోంది. సొంత మైదానంలో తడబడినా.. పరాయి వేదికలపై పంజా విసురుతోంది. అయితే.. పంజాబ్ కింగ్స్‌పై చిన్నస్వామిలో దారుణ ఓటమి మినహాయిస్తే.. అన్ని మ్యాచుల్లో ఆర్సీబీ అదరగొట్టింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 163 పరుగుల ఛేదనలో 3 కీలక వికెట్లు పడినా విరాట్ కోహ్లీ నిలబడ్డాడు.
Our bowlers last night! 🗿#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #DCvRCB pic.twitter.com/Z2Ji2oSyb2
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 28, 2025
కృనాల్ పాండ్యా(73 నాటౌట్) ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దాంతో, ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించి 7వ విజయం ఖాతాలో వేసుకుంది. దాంతో 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది బెంగళూరు. తద్వారా రజత్ పాటిదార్ బృందం ప్లే ఆఫ్స్ బెర్తుకు మరింత చేరువైంది. మిగతా 4 మ్యాచుల్లో కనీసం రెండు గెలిచినా చాలు.. 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఆడడం ఖాయం.
6 Away wins on the trot. Never done before. 😤
We will continue to #PlayBold. ⚡️#ನಮ್ಮRCB #IPL2025 #DCvRCB pic.twitter.com/4S0RE0ixnd
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 28, 2025
తొలి ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఆరు హాఫ్ సెంచరీలతో 443 రన్స్ కొట్టిన విరాట్ బెంగళూరు ట్రోఫీ కలను తీర్చేలా కనిపిస్తున్నాడు. టాపార్డర్‌లో అతడితో పాటు దేవ్‌దత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇక డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ సునామీలా విజృంభిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్(12 వికెట్లు), హేజిల్‌వుడ్(18 వికెట్లు)లు హడలెత్తిస్తున్నారు.
Our bowlers last night! 🗿#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #DCvRCB pic.twitter.com/Z2Ji2oSyb2
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 28, 2025
పవర్ ప్లేలో, ఆఖరి ఓవర్లలో వికెట్లు తీసి బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో స్పిన్ ద్వయం కృనాల్ పాండ్యా(13 వికెట్లు), సుయాశ్ శర్మలు తిప్పేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అన్ని విభాగాల్లో రాణిస్తున్నందున్న బెంగళూరు జట్టు ఈసారి కప్ వేటలో అందరికంటే ముందుంది. అయితే.. నాకౌట్ మ్యాచుల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఆడగలిగితే ఈ సాలా కప్ నమదే అనే పదానికి సార్ధకత చేకూరుతుందని విశ్లేషకులు అంటున్నారు. 2009లో దక్కన్ ఛార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.