Karnataka CM | సహనం కోల్పోయి.. ఏఎస్పీపైకి చెయ్యెత్తి.. మరో వివాదంలో కర్ణాటక సీఎం.. Video
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధరామయ్య పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు అనుకూలం కాదని, యుద్ధం కంటే సామరస్య చర్చలే ముఖ్యమనే ఉద్దేశంలో మాట్లాడానని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇవాళ బెలగావిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాటిమాటికి ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. గో టూ పాకిస్థాన్ అంటూ నినదించారు. దాంతో సీఎం సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమనిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని కఠిన స్వరంతో ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధరామయ్య తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ అధికారులంటే పాలకులకు అంత చులకనా..? అని పలువురు మండిపడుతున్నారు. కర్ణాటకలో ప్రతిపక్ష జేడీఎస్ కూడా సిద్ధరామయ్య తీరుపై మండిపడింది. సిద్ధరామయ్య నియంతృత్వ ధోరణికి ఈ ఘటన నిదర్శనమని విమర్శించింది. సిద్ధరామయ్య చేసింది క్షమించారని నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
,@siddaramaiah ನಿಮಗೆ ಅಧಿಕಾರದ ದರ್ಪ ತಲೆಗೇರಿದೆ.
ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಗೆ ಹೊಡೆಯಲು ಕೈ ಎತ್ತುವುದು ನಿಮ್ಮ ಸ್ಥಾನಕ್ಕೆ, ಘನತೆಗೆ ಕಿಂಚಿತ್ತೂ ಶೋಭೆ ತರುವುದಿಲ್ಲ.
ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನದಲ್ಲಿರುವ ನೀವು, ಬೀದಿ ರೌಡಿಯಂತೆ ಸಾರ್ವಜನಿಕ ವೇದಿಕೆಯಲ್ಲಿಯೇ ಏಕವಚನ ಪ್ರಯೋಗಿಸಿ, ಎಸ್ಪಿ (SP)ಗೆ ಹೊಡೆಯಲು ಯತ್ನಿಸಿದ್ದು ಅಕ್ಷಮ್ಯ… pic.twitter.com/GXeZbtk73t
— Janata Dal Secular (@JanataDal_S) April 28, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

