IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) పేసర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) చెలరేగుతున్నాడు. బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైదానంలో దూకుడుగా కనిపించే సిరాజ్ తాను డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానని తెలిపాడు. పవర్ ప్లే కంటే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం పెద్ద సవాల్ అని ఈ స్టార్ పేసర్ అన్నాడు. అందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు.
‘బ్యాటర్లంతా డెత్ ఓవర్లలో బౌలర్లను ఉతికిఆరేయొచ్ని అనుకుంటారు. అందుకని ఆఖరి ఓవర్లో అటాకింగ్ గేమ్ మొదలెడతారు. అందుకనే పవర్ ప్లే కంటే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం పెద్ద సవాల్’ అని ఈ హైదరాబాదీ పేసర్ తెలిపాడు. ఈ సీజన్ చాలా అద్భుతంగా సాగుతోందని అన్నాడు. ‘పదహారో సీజన్ ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నా. ముఖ్యంగా నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను. అందుకనే అంత బాగా బౌలింగ్ చేయగలుగుతున్నా. అంతేకాదు నేను ఒకే ప్రాంతంలో బంతులు విసరగలను’ అని సిరాజ్ వెల్లడించాడు.
Most wickets in the powerplay 🎳
1. RCB 2️⃣2️⃣
2. SRH 1️⃣3️⃣
3. GT 1️⃣3️⃣Massive improvement in our Powerplay game this season! 🙌#PlayBold #ನಮ್ಮRCB #LSGvRCB #IPL2023 pic.twitter.com/KSLyxwr9UR
— Royal Challengers Bangalore (@RCBTweets) May 2, 2023
ఆర్సీబీ ప్రధాన పేసర్ అయిన సిరాజ్ ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే అతను 15 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. మహమ్మద్ షమీ(Mohammed Shami ) 17 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డూప్లెసిస్ సేన గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 126 పరుగుల్ని కాపాడుకోవడంలో ఈ పేసర్ పాత్ర ఎంతో ఉంది. తొలి ఓవర్లోనే మేయర్స్‌ను ఔట్ చేసి అతను లక్నోను దెబ్బ కొట్టాడు. డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దాంతో, ఆర్సీబీ 18పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో డూప్లెసిస్ బృందం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.