IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో అదరగొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు గుడ్‌న్యూస్. వారం రోజులు టోర్నీ వాయిదా పడడంతో స్వదేశం చేరుకున్న విదేశీ ఆటగాళ్లు మళ్లీ స్క్వాడ్‌తో కలిశారు. దాంతో, రెట్టించిన ఉత్సాహంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌పై గురి పెట్టనుంది. డేంజరస్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (Phil Salt), విధ్వంసక ఆటగాడు టిమ్ డేవిడ్(Tim David), పేసర్ రొమారియో షెపర్డ్, ఆల్‌రౌండర్ లియాం లివింగ్‌స్టోన్ (Liam Livingstone)లు గురువారం బెంగళూరు చేరుకున్నారు.
ఇంగ్లండ్ యువకెరటం బెథెల్ కూడా జట్టుతో కలిశాడు. దాంతో, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రజత్ పాటిదార్ బృందం ఫుల్ జోష్‌తో నెట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. మే 17న చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
𝗢𝘂𝗿 𝘁𝗲𝗿𝗿𝗶𝗳𝗶𝗰 𝗘𝗻𝗴𝗹𝗶𝘀𝗵 𝘁𝗿𝗶𝗼 𝗶𝘀 𝗯𝗮𝗰𝗸 𝗮𝘁 𝗶𝘁! 🔙😮💨
More grit, more grind, and all gas no brakes, when it’s go time! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/fSMrySp8nG
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2025
తొలి ఐపీఎల్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18వ ఎడిషన్‌లో దుమ్మురేపుతోంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్.. బౌలింగ్ యూనిట్ సమిష్ఠిగా రాణిస్తుండడంతో 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. శనివారం కోల్‌కతాపై గెలిస్తే 18 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. దాంతో, ఈమ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బెంగళూరు జట్టు విదేశీ క్రికెటర్లు సాల్ట్, లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, షెపర్డ్, బెథెల్ రాకతో ఊపిరి పీల్చుకుంది. అయితే.. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) గాయం కారణంగా టోర్నీకి దూరం కానున్నాడు. దాంతో, భువనేశ్వర్, యశ్ దయాల్ బౌలింగ్ భారం మోయనున్నారు.
ప్లే ఆఫ్స్ బరిలో ఉన్న ఆర్సీబీ ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మే 17న కోల్‌కతాతో, మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈసారి బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, పటిదార్, ఓపెనర్ సాల్ట్, కుర్రాడు టిమ్ డేవిడ్ .. అదే జోరు చూపిస్తే ఆ జట్టు 17 ఏళ్ల కల సాకారం కావడం ఖాయం.