IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. గత మ్యాచ్‌లో 200 ప్లస్ ఛేదించిన కమిన్స్ సేన బెంగళూరుకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. రజత్ పాటిదార్ స్థానంలో ఆర్సీబీకి సారథ్యం వహిస్తున్న వికెట్ కీపర్ జితేశ్ శర్మ(Jitesh Sharma) టాస్ గెలిచి.. ఆరెంజ్ ఆర్మీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
కరోనా బారిన పడిన సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. అతడితో పాటు అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనాద్కాట్లు కూడా తుది జట్టుకు ఎంపికయ్యారు. ఆర్సీబీ కూడా దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఆడిస్తోంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, ఈషన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ : మహహ్మద్ షమీ, హర్ష్ దూబే, సచిన్ బేబీ, జీషన్ అన్సారీ, సిమర్జీత్ సింగ్.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @SunRisers in Lucknow.
Updates ▶️ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH pic.twitter.com/8IFxI9fEqa
— IndianPremierLeague (@IPL) May 23, 2025
ఆర్సీబీ తుది జట్టు : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ(కెప్టెన్, వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, యశ్ దయాల్, లుంగి ఎంగిడి, సుయాశ్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ : రజత్ పాటిదార్, రసిక్ దార్ సలాం, జాకబ్ బెథెల్, మనోజ్ భాండగే, స్వప్నిల్ సింగ్.
ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శుక్రవారం సన్‌రైజర్స్‌పై గెలిస్తే.. 19 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్‌ను రజత్ పాటిదార్ జట్టు కిందికి నెట్టేస్తుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో హైదరాబాద్ మ్యాచ్‌లో చెలరేగిపోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ప్లే ఆఫ్స్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ లభిస్తుందని అనుకుంటున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ షాకిచ్చినా ఇవ్వొచ్చు.
ఎందుకంటే.. సంచలన ఆటకు మారుపేరైన ఆరెంజ్ ఆర్మీతో అంత ఈజీ కాదని ఆ జట్టుకు బాగా తెలుసు. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకూ ఆర్సీబీ, హైదరాబాద్ 14 సార్లు తలపడ్డాయి. వీటిలో 13 పర్యాయాలు ఆరెంజ్ ఆర్మీ గెలుపొందగా.. బెంగళూరు 11 విజయాలకే పరిమితమైంది. కానీ, గత ఐదు మ్యాచుల్లో 3 విక్టరీలతో ఆ జట్టు ఆధిక్యం కనబరిచింది.