ENG vs ZIM : నాటింగ్హమ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ (England) పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఏకంగా ముగ్గురు శతకాలతో రెచ్చిపోవడంతో తొలి రోజే భారీ స్కోర్ చేసిన ఆతిథ్య జట్టు.. శుక్రవారం లంచ్‌కు ముందు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్ ఔట్ కాగానే కెప్టెన్ బెన్ స్టోక్స్ 565-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్(36 నాటౌట్), కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ (30 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. ఇంకా జింబాబ్వే 492 పరుగులు వెనకబడి ఉంది.
Curran falls to Cook, but it’s been a positive start from Zimbabwe with the bat in response to England’s hefty total
Ball-by-ball: https://t.co/Kk0XoNj3cm pic.twitter.com/qzX0dLc8Rm
— ESPNcricinfo (@ESPNcricinfo) May 23, 2025
భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సన్నాహకాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టు అదరగొడుతోంది. సొంతగడ్డపై జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఏకంగా మగ్గురు సెంచరీలతో కదం తొక్కిన మ్యాచ్‌లో స్టోక్స్ సేన పట్టుబిగించింది. 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద ఆడుతున్న జింబాబ్వే డ్రా కోసం పోరాడుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలే(124), బెన్ డకెట్(140)లు పర్యాటక జట్టు బౌలర్లకు ‘బజ్ బల్’ ఆటను రుచి చూపిస్తూ శతక గర్జన చేయగా.. మాజీ సారథి ఓలీ పోప్ సైతం బౌండరీల మోత మోగించి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. దాంతో, తొలి రోజే ఇంగ్లండ్ 500 పరుగులకు చేరువైంది.
Ollie Pope has scored a century in each of his last three Tests at Trent Bridge 💪 pic.twitter.com/m78tluzkwG
— ESPNcricinfo (@ESPNcricinfo) May 23, 2025
శుక్రవారం 493-3తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ లోపే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి సెషన్లో జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన పోప్ 117 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన స్టోక్స్(9)ను ఔట్ చేసిన బ్లెస్సింగ్ ముజరబని.. అర్థ శతకంతో జోరు మీదున్న హ్యారీ బ్రూక్(58)ను బౌల్డ్ చేశాడు. బ్రూక్ ఔటైన వెంటనే స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ స్క్వాడ్‌కు ఎంపికైన ముజరబని 143 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.