Uppena | మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం ఉప్పెన ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అసాధారణ ఆదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలోరూపొందిన ఉప్పెన చిత్రం ద్వారా కృతి శెట్టి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు. టేకింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు బుచ్చిబాబు. మొదటి సినిమాతోనే వంద కోట్లు రాబట్టారు.. సిల్వర్ స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా సినిమాకి హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఉప్పెన చిత్రం 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డుకు ఎంపికైంది.ఈ మూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 20.50 కోట్లు జరగగా, నిర్మాతలకి లాభాలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి హీరో ముందుగా వైష్ణవ్ తేజ్‌ని అనుకోలేదట.దర్శకుడు బుచ్చిబాబు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండని ఊహించుకొని కథను రాసాడట. అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు.
ఇక ఆ కథ విజయ్‌కి సూట్ కాదని భావించిన బుచ్చిబాబు తన సినిమా హీరోగా వైష్ణవ్ తేజ్‌ని ఎంపిక చేసుకున్నాడు. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడం , మూవీ హిట్ కావడం, అందరి ప్రశంసలు అందుకోవడం మనం చూసాం. ఇక ఉప్పెన సినిమాతో తన సత్తా చూపించిన బుచ్చిబాబు ఇప్పుడు తన రెండో సినిమాగా రామ్ చరణ్‌తో పెద్ది చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదల కాగా, ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో బుచ్చిబాబు క్రేజ్ పీక్స్‌కి వెళ్లడం ఖాయం అంటున్నారు.