Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలవడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 26వ తేదీన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా వివాహం జరగనుందనే ప్రచారం వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఈ భేటీ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. మొదట వీరి పెళ్లి ఫిబ్రవరి 2న జరుగుతుందని కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26 వీరి పెళ్లి తేదీగా ఫిక్స్ అయిందని ప్రచారం మొదలైంది. దీంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది.
వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్ కోటలో జరగనుందని, అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలవడం ఈ వార్తలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. టాలీవుడ్ వర్గాలు కూడా ఈ భేటీ పెళ్లి ఆహ్వానం కోసమే అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఫిబ్రవరి 26కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో, విజయ్ సీఎం ని కలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే పెళ్లి వేదిక, తేదీ, కార్యక్రమాలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం ఈ జంట పెళ్లి వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా కలిసి నటించిన గీతా గోవిండం, డియర్ కామ్రేడ్ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం మరింత బలపడిందనే టాక్ అప్పటినుంచే వినిపిస్తోంది. ఆ తరువాత పబ్లిక్ ఈవెంట్స్‌లో, సోషల్ మీడియాలో ఒకరినొకరు సపోర్ట్ చేయడం వల్ల ఈ జంటపై అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది విజయ్, రష్మిక ఇద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో పెళ్లి వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికీ పుకార్లుగానే ఉండటంతో, నిజానిజాలు బయటకు రావాలంటే అధికారిక ప్రకటన అవసరం. అప్పటివరకు మాత్రం ఈ స్టార్ జంట వివాహం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొనసాగనుంది.