KCR | సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు.
గిరిజన బిడ్డలైన బంజారాల కోసం సేవాలాల్ మహారాజ్ కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. సామాజిక సమానత్వం కోసం సేవాలాల్ చేసిన కృషి భావితరాలకు ఆచరణీయమని అన్నారు. సేవాలాల్ స్ఫూర్తితో బీఆర్ఎస్ హయాంలో బంజారాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో బంజారాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.