BRS | తాండూరు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు
BRS | వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రం లోపలికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేసినందుకు వారిపై కేసులు పెట్టారు.
BRS | వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రం లోపలికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేసినందుకు వారిపై కేసులు పెట్టారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడికాకముందే కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లోపలికి వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గంటకు పైగా బైఠాయించారు. కౌంటింగ్ జరుగుతుండగా ఎమ్మెల్యేను లోపలికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో పోలీసులకు, పైలెట్ రోహిత్ రెడ్డికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినవారిపై కాకుండా, అన్యాయాన్ని నిలదీసిన వారిపై కేసులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

