IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జోరు కొనసాగుతోంది. తొలిపోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షాకిచ్చిన బెంగళూర.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను చిత్తు చేసింది. వరుసగా రెండు విజయాలతలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది రజత్ పాటిదార్ బృందం.
మైదానంలోనే కాదు సోషల్ మీడియా ఫాలోయింగ్‌లోనూ సీఎస్కేకు గట్టి షాక్ ఇచ్చింది బెంగళూరు జట్టు. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ మేనియా నడుస్తోంది. ఐపీఎల్ టీమ్‌లలో మరే జట్టుకు లేనంతగా 1.78 కోట్ల మంది బెంగళూరు ఫ్రాంచైజీని అనుసరిస్తున్నారు. దాంతో, ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై రెండో స్థానానికి పడిపోయింది. సీఎస్కేకు ఇన్‌స్టాలో ప్రస్తుతం 1.77 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Officially the biggest brand in the IPL. 🔥💪🏻#RCB pic.twitter.com/csBs518JoV
— RCBXTRA (@RCBXTRAOFFICIAL) March 31, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా అభిమానులున్న ఐపీఎల్ జట్లలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. సీఎస్కేతో సమానంగా ఐదు టైటిళ్లు సాధించిన ముంబైని 1.62 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి బెంగళూరు ఫ్యాన్స్ తమ జట్టు తొలి టైటిల్ గెలిస్తే చూసి తరించాలాని కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. మూడు పర్యాయాలు(2009, 2011, 2016) ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి మెట్టుపై చతికిలపడింది.
Back 2️⃣ back wins! 🔥
Chat, how are we feeling? 🤩
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2025
అయినా సరే ప్రతి సీజన్లో ఈ సాలా కప్ నమదే అనే స్లోగన్‌తో తమ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు ఫ్యాన్స్. 18వ సీజన్లో బెంగళూరు జట్టు వరుసగా రెండు విక్టరీలతో టైటిల్‌పై ఆశలు రేపుతోంది. అందుకే.. ఇన్‌స్టాలో ఎక్కువమంది ఆర్సీబీ ఫ్రాంచైజీని పెద్ద మొత్తంలో ఫాలో అవుతున్నారు. ఆర్సీబీ తమ మూడో మ్యాచ్ సొంతమైదానంలో ఆడనుంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటన్స్ జట్టును ఏప్రిల్ 2న ఢీ కొట్టనుంది.
ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 1.78 కోట్లు
2. చెన్నై సూపర్ కింగ్స్ – 1.77 కోట్లు
3. ముంబై ఇండియన్స్ – 1.62 కోట్లు
4. కోల్‌కతా నైట్ రైడర్స్ – 70 లక్షలు
5. సన్‌రైజర్స్ హైదరాబాద్ – 58 లక్షలు
Sailing At The Top ⛵@RCBTweets lead the Points Table after Match 1️⃣1️⃣ of #TATAIPL 2025 👌
How has the start been for your favourite team? ✍ pic.twitter.com/2fvbCunCAY
— IndianPremierLeague (@IPL) March 30, 2025
6. రాజస్థాన్ రాయల్స్ – 47 లక్షలు.
7. గుజరాత్ టైటన్స్ – 45 లక్షలు
8. ఢిల్లీ క్యాపిటల్స్ – 43 లక్షలు.
9. పంజాబ్ కింగ్స్ -37 లక్షలు
10. లక్నో సూపర్ జెయింట్స్ – 35 లక్షలు.