కొల్లాపూర్ : ముస్లిం సోదరులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్లోని ఖాదర్ పాషా ఈద్గాలో రంజాన్ ( Ramzan) సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది, అల్లా దయతో ప్రజాలంతా సుఖసంతోషాలతో ఉండాలని అకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని, అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమన్నారు. సమాజానికి ఉపయోగడే అల్లా బోధనలను ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సామరస్యంతో ఉందన్నారు.