Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటోన్గ్ పాసిర్లోని శ్రీశివదుర్గ ఆలయంలో ఈ నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా సొసైటీ సభ్యులు ఆదివారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) రాసిన గంటల పంచాంగాన్ని సొసైటీ సభ్యులకు అందజేశారు. ఈ వేడుకల్లో 300 మందికి పైగా తెలుగు వాళ్లు పాల్గొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని భక్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోశ్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, సంతోశ్ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఉగాది వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన దాతలకు, స్పాన్సర్లకు, సంబురాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ TCSS అధ్యక్షులు గడప రమేశ్ బాబు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీశ్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకలలో పాల్గొన్న వైఎస్వీఎస్ఆర్ కృష్ణ (పాస్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) కు అధ్యక్షులు గడప రమేశ్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్ మరియు సౌజన్య డెకార్స్కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.