మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 29, 2020 , 20:41:14

CSK vs KKR: నితీశ్‌ రాణా అర్ధసెంచరీ

CSK vs KKR:  నితీశ్‌ రాణా అర్ధసెంచరీ

దుబాయ్:  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ నితీశ్‌ రాణా అర్ధశతకం సాధించాడు. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు.   ఈ క్రమంలోనే 44 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ సహకారం అందించకపోయినా స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.  15 ఓవర్లకు కోల్‌కతా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రాణా(58), ఇయాన్‌ మోర్గాన్‌(4) క్రీజులో ఉన్నారు. ఆఖరి ఓవర్లలో చెలరేగాలని  కోల్‌కతా భావిస్తోంది.