BCCI | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) అధ్యక్షుడి రోజర్ బిన్నీ తప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. ఆయన స్థానంలో జులై తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయసు జులై 19 నాటికి ఆయనకు 70 సంవత్సరాలు నిండనున్నాయి. అయితే, బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు కాగా.. నిబంధనల మేరకు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి రానున్నది. దాంతో ఖాళీని భర్తీ చేసేందుకు 65 ఏళ్ల శుక్లా మూడు నెలల పాటు తాత్కాలిక బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
సెప్టెంబర్‌లో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా రాజీవ్ శుక్లాకు 66 ఏళ్లు నిండుతాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దాంతో ఆయన అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ పడే అవకాశాలున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బీసీసీఐ అధ్యక్షుడి వయస్సు 70 ఏళ్లు మించకూడదు. అలాగే 2021లో బీసీసీఐ 90వ ఏజీఎం తర్వాత ఒక ప్రకటనలో ‘మ్యాచ్ అధికారులు, అసోసియేట్ సభ్యుల వయోపరిమితిని 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అయితే అది వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
రోజర్ బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. గంగూలీ తన మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోగా.. బిన్నీ ఒక్కడే పదవికి పోటీపడ్డారు. బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడైన తర్వాత.. భారత్ రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఐసీసీ టోర్నమెంట్లను గెలుచుకుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. చారిత్రాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కూడా బిన్నీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశీయ క్రికెట్‌కు ప్రాధాన్యం లభించింది. ఆటగాళ్ల జీతకాలు సైతం పెరిగాయి. టీమిండియా సీనియర్లు సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడేలా కఠిన చర్యలు తీసుకుంది బీసీసీఐ.
ఇక రోజర్ బిన్నీ విషయానికి వస్తే.. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక సభ్యుడు. ఆల్ రౌండర్ బిన్నీ 27 టెస్ట్ మ్యాచ్‌లు, 72 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ మ్యాచుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఐదు హాఫ్ సెంచరీల సహాయంతో 830 పరుగులు చేశాడు. 72 వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ సహాయంతో 629 పరుగులు చేశాడు. భారత్ తొలి వన్డే ప్రపంచ కప్ (1983) గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 1983 ప్రపంచ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. బిన్నీ గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పని చేశారు.
Virat Kohli | కోహ్లీ వన్ 8 కమ్యూన్ పబ్‌పై కేసు నమోదు
ఫైనల్‌కు పంజాబ్.. ముంబైపై కింగ్స్ ఉత్కంఠ విజయం