Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన ఓ పబ్‌పై కేసు నమోదైంది. బెంగళూరు (Bengaluru)లోని ఎమ్జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ (One8 Commune)లో స్మోకింగ్ జోన్ (smoking zone) లేకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు.
కాగా, కోహ్లీకి చెందిన ఈ బప్పై కేసు నమోదు కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో పలు కారణాలతో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండటంతో గతేడాది జులైలో కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి భారీగా సౌండ్లు రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో ఎమ్జీ రోడ్డులోని వన్ 8 కమ్యూన్, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్ అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి 1:30 గంటల వరకూ తెరిచి ఉంచడాన్ని గుర్తించారు. దీంతో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంతో ఆయా రెస్టారెంట్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో కూడా ఈ పబ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు (Fire Safety Violations) బెంగళూరు బృహత్ మహానగర పాలిక అధికారులు గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
Also Read..
Corona Virus | 4 వేలకు చేరువలో కొవిడ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి
IndiGo | దుమ్ము తుఫానుతో ఆకాశంలో అల్లకల్లోలం.. ఇండిగో విమానంలో భారీ కుదుపులు
Vitamin D Deficiency | 70శాతం ముస్లిం మహిళల్లో విటమిన్-డీ లోపం..! అసలు కారణం ఏంటంటే..?