IPL 2023 : పదహారో సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకుంది. స్టార్ పేసర్ ప్రసిధ్ కృష్ణ(Prasidh Krishna) స్థానంలో అనభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్ సందీప్ శర్మ(Sandeep Sharma)ను తీసుకుంది. ప్రసిధ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, అతని ప్లేస్‌లో కుడి చేతివాటం ఫాస్ట్ బౌలర్ అయిన సందీప్‌ను జట్టులోకి తీసుకుంది. సందీప్‌కు ఐపీఎల్లో పది సీజన్లు ఆడిన అనుభవం ఉంది.
గతంలో అతను పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. పవర్ ప్లేలో తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. 2014లో సందీప్ మెరుగైన ప్రదర్శన చేశాడు. పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అతను ఆ సీజన్లో 18 వికెట్లు నేలకూల్చాడు. 2016, 17 సీజన్లలోనూ ఈ పేసర్ 15, 17 వికెట్లతో సత్తా చాటాడు. 2022 మినీ వేలంలో రూ.10 కోట్లకు ప్రసిధ్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీశాడు.17 మ్యాచుల్లో ప్రసిధ్ 19 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్ ఆరంభం నుంచే సత్తా చాటాలనుకుంటున్న రాజస్థాన్‌కు షాకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ క్రికెటర్లు లిట్టన్ దాస్, షకిబుల్ హసన్ ఈసీజన్లో ఆడేది ఆనుమానమే. కారణం ఏంటంటే..? వీళ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా ఇవ్వలేదు. ఏప్రిల్ 4-8 మధ్య ఐర్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఉన్నందున ఈ స్టార్ ప్లేయర్స్‌కు ఎన్వోసీ ఇవ్వడం లేదని బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపాడు. దాంతో, మ్యాచ్ విన్నర్ అయిన ఆల్‌రౌండర్ షకిబ్ సేవల్ని రాజస్థాన్ కోల్పోయే ఛాన్స్ ఉంది.
పదిహేనో సీజన్లో సంజూ శాంసన్(Sanju Samson) కెప్టెన్సీలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ రన్నరప్‌గా నిలిచింది. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని గుజరాత్ టైటన్స్ చేతిలో ఫైనల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దాంతో, ఈసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ జట్టు ఏప్రిల్ 2న తమ మొదటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టనుంది.
Okay then, making this official. 👍💗 https://t.co/FAjBB6808I pic.twitter.com/Rf3ZwI0bSH
— Rajasthan Royals (@rajasthanroyals) March 27, 2023