Marnus Labuschagne : టెస్టుల్లో నంబర్ 1 బ్యాటర్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఆసీస్ జట్టులో ఎంతో కీలక ఆటగాడో తెలిసిందే. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారిస్తాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. బౌలర్లకు పరీక్ష పెడుతూ భారీ స్కోర్లు సాధిస్తాడు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఈ మిడిలార్డర్ బ్యాటర్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇష్టమైన ఇండియన్ ఫుడ్, నచ్చిన ఐపీఎల్ టీమ్, కష్టమైన బౌలర్, కలిసి బ్యాటింగ్ చేయాలనుకున్న క్రికెటర్.. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇంతకు ఈ28 ఏళ్ల ఆస్ట్రేలియన్ స్టార్ ఏం చెప్పాడంటే..?
1. మీకు ఇష్టమైన భారతీయ వంటకం ఏది?
లబూషేన్ : బటర్ చికెన్, స్పినాచ్ నాన్ అంటే చాలా ఇష్టం. భారత పర్యటనలో 8 వారాలు ప్రతి రోజు అదే ఫుడ్ తిన్నా.
2. ఒకవేళ అవకాశం వస్తే.. స్టీవ్ స్మిత్‌తో కాకుండా ప్రపంచలోని నలుగురు అత్యుత్తమ బ్యాటర్లలో ఎవరితో బ్యాటింగ్ చేస్తారు?
లబూషేన్ : విరాట్ కోహ్లీ
3. టీ20ల్లో బెస్ట్ బ్యాటర్ ఎవరు ?
లబూషేన్ : సూర్యకుమార్ యాదవ్. పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ కంటే సూర్య చాలా బెటర్.
4. కెరీర్లో మీరు ఎదుర్కొన్న కష్టమైన బౌలర్ ఎవరు?
లబూషేన్ : రవిచంద్రన్ అశ్విన్. అతని బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం.
5. రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద మీ అభిప్రాయం?
లబూషేన్ : అతను బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా స్టైల్‌గా ఆడతాడు.
6. ఐపీఎల్లో ఫేవరెట్ టీమ్ ఏది?
లబూషేన్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
7. మాజీ ఫాస్ట్ బౌలర్లలో ఎవరిని ఎదుర్కోవాలని ఉంది?
లబూషేన్ : గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై చెలరేగిన లబుషేన్ బోర్డర్ – గవాస్కర్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో మాత్రం విఫలమయ్యాడు. కీలకమైన మూడో టెస్టులో రాణించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. భారత జట్టు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సాధించడం ఇది వరుసగా నాలుగోసారి.