Nitish Rana | కోల్‌కతా కెప్టెన్‌గా నితీశ్ రానా.. దేశవాళీలో ఢిల్లీని నడిపించిన లెఫ్ట్ హ్యాండర్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కొత్త కెప్టెన్ గురించిన ఊహాగానాలకు తెరదించింది. యంగ్‌స్టర్ నితీశ్ రానా(Nitish Rana)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయం నుంచి కోలుకోకపోడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 16వ సీజన్లో కేకేఆర్‌కు సారథ్యం వహించనున్నాడు.
Nitish Rana : ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కొత్త కెప్టెన్ గురించిన ఊహాగానాలకు తెరదించింది. యంగ్‌స్టర్ నితీశ్ రానా(Nitish Rana)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయం నుంచి కోలుకోకపోడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ 16వ సీజన్లో కేకేఆర్‌కు సారథ్యం వహించనున్నాడు. కోల్‌కతా కొత్త కెప్టెన్ రేసులో ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌తో పాటు విధ్వంసక ఆటగాడు ఆండ్రూ రస్సెల్ పేర్లు వినిపించాయి. అయితే.. ఆఖరికి నిలకడగా రాణిస్తున్న రానా వైపే యాజమాన్యం మొగ్గు చూపింది.
‘శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకొని ఐపీఎల్ 2023లో కొన్ని మ్యాచ్‌లైనా ఆడతాడని ఆశిస్తున్నాం. నితీశ్ కెప్టెన్‌గా జట్టును సమర్ధంగా నడిపిస్తాడని భావిస్తున్నాం. ఈ లీగ్‌లో అతడికి చాలా అనుభవం ఉంది. అతను తన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తాడనే నమ్మకం మాకుంది’ అని కోల్‌కతా ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో తెలిపింది.
2018 నుంచి ఫ్రాంఛైజీతో..
నితీశ్ రానా 2018 నుంచి కోల్‌కతాతో కొనసాగుతున్నాడు. గత ఐదు సీజన్లలో 300లకు పైగా పరుగులు సాధించి నిలకడగా రాణిస్తున్నాడు. అంతేకాదు దేశవాళీ టోర్నమెంట్లలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం రానాకు ఉంది. ఐపీఎల్లో ఓపెనర్‌గా అదరగొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 2021లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనలో రెండు టీ20లు, ఒక వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య ఆరంభ పోరు జరగనుంది. ఈ సీజన్లో కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది.
తిరగబెట్టిన వెన్నునొప్పి
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వెన్నెముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో అతడికి గాయం తిరగబెట్టింది. దాంతో, అతను బరిలోకి దిగలేదు. వన్డే సిరీస్‌లోనూ అయ్యర్ ఆడలేదు. ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్ రిహబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. గౌతం గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. అయితే.. 2017 తర్వాత ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకోలేదు. గత సీజన్లో అయ్యర్ కెప్టెన్సీలోనూ కోల్‌కతా విఫలమైంది. అందుకని ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
𝘙𝘢𝘯𝘢’𝘴 𝘢𝘵 𝘵𝘩𝘦 𝘸𝘩𝘦𝘦𝘭! Welcome, Captain! 💜💛@NitishRana_27 #AmiKKR #KKR #TATAIPL2023 #Leader #NitishRana #Nitish pic.twitter.com/Z9UAKToYWj
— KolkataKnightRiders (@KKRiders) March 27, 2023
ఇవి కూడా చదవండి
PSG Club | మెస్సీ, ఎంబాపేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం : పీఎస్జీ క్లబ్
ICC | బీసీసీఐ అప్పీల్‌తో దిగొచ్చిన ఐసీసీ.. ఇండోర్ పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

