PSG Club | మెస్సీ, ఎంబాపేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం : పీఎస్జీ క్లబ్
వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi), యంగ్‌స్టర్ కైలియన్ ఎంబాపేల( Kylian Mbappe)ను ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోమని పీఎస్జీ (ప్యారిస్ సెయింట్ జెర్మెన్) క్లబ్ అధ్యక్షుడు నసీర్ అల్ ఖెలాఫీ తెలిపాడు. మరో మూడు నెలల్లో ఈ క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగియనుంది. ఎంబాపే మరో ఏడాది పాటు పీఎస్జీతో కొనసాగునున్నాడు.
PSG Club : ప్రపంచ ఫుట్‌బాల్‌లో పాపులర్ ఆటగాళ్లకు ఉండే డిమాండే వేరు. వాళ్లతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు పలు క్లబ్స్ పోటీ పడుతుంటాయి. అంతేకాదు వాళ్లను వదులుకునేందుకు ఏమాత్రం సాహసించవు. తాజాగా వరల్డ్ కప్ హీరో లియోనల్ మెస్సీ(Lionel Messi), యంగ్‌స్టర్ కైలియన్ ఎంబాపేల( Kylian Mbappe)ను ఎట్టి పరిస్థితుల్లోనే వదులుకోమని పీఎస్జీ (ప్యారిస్ సెయింట్ జెర్మెన్) క్లబ్ అధ్యక్షుడు నసీర్ అల్ ఖెలాఫీ తెలిపాడు.
‘ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఇద్దరు ఫార్వర్డు ఆటగాళ్లు మా క్లబ్లో ఉండడం మా అదృష్టం. వాళ్లను మాతోనే కొనసాగేలా చూసుకుంటాం. వాళ్లను వదులుకొని పొరపాటు చేయాలని అనుకోవడం లేదు’ అని అతను వెల్లడించాడు. మరో మూడు నెలల్లో ఈ క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగియనుంది. ఎంబాపే మరో ఏడాది పాటు పీఎస్జీతో కొనసాగునున్నాడు. ఆ తర్వాత వీళ్లతో మళ్లీ కొత్తగా ఒప్పందం కుదుర్చుకోవాలని పీఎస్జీ పావులు కదుపుతోంది.
ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జంటగా
పోయిన ఏడాదిఖతర్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ, ఎంబాపే తలపడ్డారు. హోరాహోరీ ఫైట్‌లో మెస్సీ సేన 4-2తో షూటౌట్లో విజయం సాధించింది. హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన ఎంబాపే ఫ్రాన్స్ జట్టును గెలిపించినంత పని చేశాడు. కానీ, షూటౌట్లో అర్జెంటీనా మ్యాజిక్ చేసింది. దాంతో, ఆ జట్టు మూడోసారి విశ్వ విజేతగా అవతరించింది. వరల్డ్ కప్ తర్వాత వీళ్లిద్దరూ పీఎస్జీ తరఫున సౌదీ లీగ్‌లో ఆడారు. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని అల్ నస్రీ క్లబ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. క్రొయేషియా స్టార్ మోడ్రిక్ త్వరలోనే రియల్ మాడ్రిడ్‌ను వీడుతాడని, సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీకి వెళ్తాడనే వార్తలు వినిపించాయి. అయితే.. ఆ వార్తల్ని అతను కొట్టి పారేశాడు. తాను వచ్చే సీజన్లోనూ రియల్ మాడ్రిడ్ క్లబ్‌కే ఆడతానని స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | 16వ సీజన్లో కొత్త జెర్సీతో ఆర్సీబీ.. గేల్, డివిల్లియర్స్ జెర్సీలకు రిటైర్మెంట్
ICC | బీసీసీఐ అప్పీల్‌తో దిగొచ్చిన ఐసీసీ.. ఇండోర్ పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్
MS Dhoni: స్టేడియంలో కుర్చీలకు పెయింట్ వేసిన ధోనీ.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

