IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్(Match Fixing) భూతం కలకలం రేపుతోంది. వరుసగా రెండుసార్లు గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఫిక్సింగ్‌కు పాల్పడిందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యలో ఫ్రాంచైజీ బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. తమ జట్టు, ఫ్రాంచైజీ పేరును దెబ్బతీయడానికే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కన్వీనర్ జైదీప్ బిహానీ(Jaideep Bihani) అసత్య కథనాలు వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. జైదీప్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలని సంజూ సేన ప్రభుత్వానికి విన్నవించింది.
అసలేం జరిగిందంటే.. పద్దెనిమిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ చేజేతులా ఓడింది. 188 పరుగుల ఛేదనలో ఓపెనర్ యశస్వీ అర్ద శతకంతో మెరిసినా.. మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్(LSG)తోనూ అంతే. అవేశ్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా వరుసగా వికెట్లు కోల్పోయి.. 2 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. దాంతో, రాజస్థాన్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RSA) కన్వీనర్ జైదీప్ ఆరోపించాడు.
🚨🚨BIG BREAKING NEWS 🚨🚨
FIXING NEWS IN #IPL#RajasthanRoyals accused of ‘match-fixing’ vs LSG; ‘Investigation necessary’, says RCA ad hoc committee convenor #JaideepBihani, convenor of Rajasthan Cricket Association (RCA) ad hoc committee fired shots at IPL franchise RR,… pic.twitter.com/eWB58XExt8
— TollywoodRulz (@TollywoodRulz) April 22, 2025
ఫలితంగా.. ఇది నిజమేనంటూ సోషల్ మీడియాలో సంజూ శాంసన్ బృందానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు వెలిశాయి. ఫ్రాంచైజీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ కుట్రను రాజస్థాన్ యాజమాన్యం ఖండించింది. తప్పుడు ప్రచారం కల్పిస్తున్న జైదీప్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. జైదీప్ చేసిన ఆరోపణలు అవాస్తవం. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఎలాంటి ఆధారం లేదు అని రాజస్థాన్ ఫ్రాంచైజీ దీప్ రాయ్ మీడియాకు వెల్లడించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న రాజస్థాన్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా కెప్టెన్ సంజూ శాంసన్ దూరమైన విషయం తెలిసిందే.
Watch for some guaranteed in-flight entertainment! 😋💗 pic.twitter.com/R0OAxG25PO
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2025