భోపాల్: ప్రియుడితో కలిసి కారులో భార్య ఉండటాన్ని భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు. (Wife, lover try to run over Husband) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. అనిల్ పాల్‌కు రజనీతో తొమ్మిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె ఉన్నారు.
కాగా, అనిల్ తన ఇంట్లోనే స్టేషనరీ షాప్ నిర్వహిస్తున్నాడు. భార్య రజనీ భర్తతో గొడవ పడి తరచుగా పుట్టింటికి వెళ్లేది. అక్కడ పొరుగున నివసించే మంగళ్ సింగ్ కుష్వాతో ఆమెకు పెళ్లి ముందు నుంచే సంబంధం ఉందని అనిల్ అనుమానించాడు. మార్చి 20న కడుపు నొప్పిగా ఉందని రజనీ తెలిపింది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
మరోవైపు సాయంత్రం ఆరు గంటల వరకు రజనీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భర్త అనిల్ ఆమె కోసం బయట వెతికాడు. ఝాన్సీ రోడ్‌లోని బస్టాండ్ వద్ద ప్రియుడు కుష్వాతో కలిసి కారులో ఉన్న రజనీని అతడు చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే అనిల్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు.
కాగా, కారు కిందపడిన అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. హిట్ అండ్ రన్ కేసుగా పొలీసులు తొలుత భావించారు. కోలుకున్న తర్వాత అనిల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ప్రియుడితో కలిసి భార్య రజనీ తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదు చేశాడు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించారు. పరారీలో ఉన్న రజనీ, ఆమె ప్రియుడు మంగళ్ సింగ్ కుష్వాను నెల తర్వాత అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ग्वालियर, पति ने अपनी पत्नी को प्रेमी के साथ पकडा। जब पति ने उन्हें रोकने की कोशिश की तो पत्नी ने कार से पति को कुचल कर चलती बनि.
ऐसी स्थिति में कभी आगे मत आना, आज महिलाएं अपराध करने के लिए प्रोत्साहित महसूस करती हैं।#MenToo #MensRights #MenLivesMatter #JusticeIsDue pic.twitter.com/5mBrcUTClQ
— Men Helpline (@menhelpline) March 28, 2025