Blue Drum Gift To Newly Weds | కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్ గిఫ్ట్.. వీడియో వైరల్
Blue Drum Gift To Newly Weds | కొత్తగా పెళ్లైన జంటకు అరుదైన బహుమతి అందింది. వరుడి స్నేహితులు బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వింది. మీరట్ భయానక హత్యను గుర్తు చేసిన ఈ బ్లూ డ్రమ్ గిఫ్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: కొత్తగా పెళ్లైన జంటకు అరుదైన బహుమతి అందింది. వరుడి స్నేహితులు బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వింది. మీరట్ భయానక హత్యను గుర్తు చేసిన ఈ బ్లూ డ్రమ్ గిఫ్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Blue Drum Gift To Newly Weds) ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక జంట వివాహం అనంతరం బంధుమిత్రులు బహుమతులు సమర్పించారు. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పెద్ద బ్లూ డ్రమ్‌తో వేదికపైకి చేరుకున్నారు. కొత్త జంటకు దీనిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మీరట్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమ్మెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్ దాయడాన్ని ఇలా గుర్తు చేయడంపై కొందరు మండిపడ్దారు. ‘ఇంతకంటే దారుణమైన జోక్ ఏముంటుంది! పెళ్లి లాంటి సంతోషకరమైన సందర్భంలో హాస్యాస్పదంగా ఒక హత్యను గుర్తుచేసుకోవడం సరికాదు’ అని ఒకరు విమర్శించారు.
మరోవైపు ప్రపంచమంతా మానసిక వ్యాధిగ్రస్తులమయంగా మారిందని, మీరట్ మారణకాండను ఎగతాళి చేయడం పరిపాటిగా మారిందని మరొకరు మండిపడ్దారు. ఇలాంటి స్నేహితులున్న వారికి శత్రువులు అవసరం లేదని ఒకరు దుయ్యబట్టారు. ఈ మూర్ఖులు పెళ్లికూతురును రెచ్చగొడుతున్నారని మరొకరు విమర్శించారు.
इससे भद्दा मज़ाक और क्या हो सकता है! शादी जैसे खुशी के मौके पर एक जघन्य हत्याकांड को मज़ाक के रूप में याद करने को कतई उचित नहीं कहा जा सकता।
👉उत्तर प्रदेश के जिला हमीरपुर में शादी के दौरान दोस्तों ने दूल्हा–दुल्हन को “नीला ड्रम” गिफ्ट किया। pic.twitter.com/tvGnVlWsIb
— बेसिक शिक्षा सूचना केंद्र (@Info_4Education) April 19, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

