IND vs NZ 1st Test : సొంతగడ్డపై తిరుగులేని భారత జట్టు మరో టెస్టు సమరానికి కాచుకొని ఉంది. ఇటీవలే బంగ్లాదేశ్ (Bangladesh)ను వైట్‌వాష్ చేసి.. 18వ సారి టెస్టు సిరీస్ పట్టేసిన టీమిండియా ఇక న్యూజిలాండ్ (Newzealand)తో తాడోపేడో తేల్చుకోనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25) పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం కివీస్‌ను మూడు టెస్టుల్లో ఓడిస్తే ఫైనల్ చేరడం ఖాయం. అందుకని అక్టోబర్ 16, బుధవారం రోజు మొదలయ్యే తొలి టెస్టుకోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. అయితే.. బెంగళూరు వేదికగా జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో మొదటి టెస్టు జరుగనుంది. అయితే.. బెంగళూరులో గత రెండు మూడు రోజులుగా భారీగా వర్షం పడుతోంది. బుధవారం, గురువారం మాత్రమే కాదు ఆ తర్వాత రోజులు కూడా చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు రోజుల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, వర్షం కురిసేందుకు 40 శాతం అవకాశముందని బెంగళూరు వెదర్ రిపోర్ట్‌ను వెల్లడించింది.
Heavy rain in #Bengaluru 🌧️
Declare holiday for Schools, colleges & Companies or WFH for companies!!@siddaramaiah @Bnglrweatherman #bengalururains @CMofKarnataka
— Gus. 𝕏 (@Sumnexyz) October 15, 2024
📍 Bengaluru
The preps have begun for the #INDvNZ Test Series 💪#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/z4d8WjzwGv
— BCCI (@BCCI) October 14, 2024
ఈ నేపథ్యంలో ఇరుజట్లకు కీలకమైన తొలి టెస్టు ఐదు రోజుల పాటు సాగడంపై సందేహాలు నెలకొన్నాయి. అదే జరిగితే.. కాన్పూర్ టెస్టు మాదిరిగా టీ20 తరహాలో చెలరేగి ఫలితాన్ని సాధించాల్సి ఉంటుంది. బంగ్లాపై అద్భుత విజయంతో జోష్ మీదున్న భారత్‌కు.. శ్రీలంక పర్యటనలో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది.
𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱
𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍
One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh
— BCCI (@BCCI) October 15, 2024
కానీ, ఆ జట్టు మాజీ సారథి కేన్ విలియమ్సన్ (Kane Williamson) తొలి టెస్టుకు దూరం కానున్నాడు. యువ పేసర్ బేన్ సియర్స్ కూడా గాయంతో డగౌట్‌కే పరిమితం కానున్నాడు. దాంతో.. స్వదేశంలో ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుగా ఓడించే టీమిండియాకు కివీస్ సైన్యం ఏ మేరకు సవాల్ విసురుతుందో చూడాలి.