SL vs BAN : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. గాలే వేదికగా బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంక(Srilanka) మధ్య జరుగుతున్న మ్యాచ్ ఐదో రోజు తొలి సెషన్ సమయంలో వాన మొదలైంది. అర్ధ శతకానికి చేరువైన ముష్ఫికర్ రహీం (49) రనౌట్ కాగానే చినుకులు పడడంతో అంపైర్లు ముందుగానే లంచ్‌ను ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(89 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. బంగ్లా ప్రస్తుతం 247 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక (Srilanka) పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. ఓపెనర్ పథుమ్ నిశాంక (187) సూపర్ సెంచరీతో, దినేశ్ చండీమాల్(54) అర్ధశతకంతో విరుచుకుపడినా.. బంగ్లా స్పిన్నర్ నయీం హసన్(5-121) ధాటికి మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కమిందు మెండిస్(89) మినహా ఏ ఒక్కరు పెద్ద స్కోర్ చేయలేదు. కెరియర్లో చివరి టెస్టు ఆడుతున్న ఎంజెలో మాథ్యూస్(39) నిరాశపరిచాడు. నయీం విజృంభణతో 485 పరుగులకే ఆలౌటయ్యింది లంక.
Mushfiqur Rahim is run-out on 49 just before the rain arrives!
Bangladesh 237 for 4, lead by 247 runshttps://t.co/TLctQjQHK9 #SLvBAN pic.twitter.com/tZRdyq72PI
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2025
తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రభాత జయసూర్య ఓవర్లో అనాముల్ హక్(4) ఔటయ్యాడు. ఓపెనర్ షాదాం ఇస్లాం(78) అర్ధ సెంచరీతో రాణించగా.. మొమినుల్ హక్ త్వరగానే ఔటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(89 నాటౌట్), ముష్ఫికర్ రహీం(49)లు మరోసారి కీలక భాగస్వామ్యంతో లంక బౌలర్లను విసిగించారు. ఐదో రోజు తొలి సెషన్లో ధాటిగా ఆడుతున్న రహీం రనౌటయ్యాడు. అప్పటికీ బంగ్లా స్కోర్ 237-4. ఆ సమయానికే వాన మొదలవ్వడంతో అంపైర్లు త్వరగానే లంచ్ గంట మోగించారు.