IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోర్ ఆశలన్నీ మిడిలార్డర్ మీదే ఆధారపడి ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా (5-74) విజృంభణతో ఇంగ్లండ్‌ను రెండో సెషన్లోనే చుట్టేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్(53 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ కరుణ్ నాయర్ (40), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16) తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. నాలుగో వికెట్‌గా వచ్చిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (19 నాటౌట్) తనదైన స్టయిల్లో ఆడి రాహుల్‌కు సహకరించాడు. అయితే.. 75 ఓవర్లకే మ్యాచ్‌ను నిలిపిపేయడంతో స్టంప్స్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 242 రన్స్ వెనకబడి ఉంది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో రెండో విజయంపై కన్నేసిన భారత జట్టు లార్డ్స్ టెస్టులో పోరాడుతోంది. టాపార్డర్ విఫలం కావడంతో జట్టును గట్టెక్కించే బాధ్యత మిడిలార్డర్ తీసుకోవాల్సి ఉంది. భారత ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే జోఫ్రా ఆర్చర్ డేంజరస్ యశస్వీ జైస్వాల్(13)ని ఔట్ చేశాడు. యశస్వీ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ ఒడుపుగా అందుకున్నాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్(40), కేఎల్ రాహుల్(53 నాటౌట్)లు కీలక భాగస్వామ్యం నిర్మించి.. వికెట్ పడకుండా చూసుకున్నారు.
That’s stumps on Day 2!
KL Rahul and Vice-captain Rishabh Pant are in the middle 🤝 #TeamIndia trail by 242 runs in the first innings
Scorecard ▶️ https://t.co/omiZVl0Plb#ENGvIND pic.twitter.com/KU2IRcQO0Z
— BCCI (@BCCI) July 11, 2025
టీ బ్రేక్ తర్వాత స్టోక్స్ బౌలింగ్‌లో నాయర్ కట్ చేసిన బంతిని జో రూట్ డైవింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఫస్ట్ స్లిప్‌లో కాచుకొని ఉన్న ఇంగ్లండ్ స్టార్ రెప్పపాటులో ఎడమవైపు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. నాయర్ పెవిలియన్ చేరడంతో 74 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16) జతగా ఇన్నింగ్స్ నిర్మించాడు రాహుల్. అయితే.. ఈ ద్వయాన్ని విడదీసేందుకు క్రిస్ వోక్స్ పన్నిన వ్యూహంలో గిల్ చిక్కుకున్నాడు. అనంతరం రాహుల్‌కు సహకరిస్తూ రిషభ్ పంత్ జట్టు స్కోర్ 140 దాటించాడు. వీళ్లిద్దరూ మూడో రోజు తొలి సెషన్లో నిలబడితే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం.
బర్మింగ్హమ్లో భారత పేసర్ల విజృంభణతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ లార్డ్స్‌లోనూ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా (5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఒకదశలో 271కే ఏడు వికెట్లు పడినా.. బ్రాండన్ కార్సే (56), వికెట్ కీపర్ జేమీ స్మిత్(51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారీ స్కోర్ అందించారు. అర్ధ శతకం తర్వాత జోరు పెంచిన కార్సే.. సిరాజ్ సంధించిన స్లో బాల్‌కు బౌల్డ్ కావడంతో 387 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది.
బుమ్రా (5-74)