Samit Dravid : భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారుడు సమిత్ ద్రవిడ్ (Samit Dravid) క్రికెట్లో దూసుకొస్తున్నాడు. జూనియర్ స్థాయిలో రాణించిన సుమిత్ అండర్ -19 జట్టులో చోటు దక్కించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టీమిండియా జెర్సీ వేసుకోవాలనే కల నిజం కానుండడంతో సమిత్ సంతోషంలో మునిగితేలుతున్నాడు.
అండర్ -19 జట్టుకు ఎంపికవ్వడంపై స్పందించిన సమిత్.. ‘భారత అండర్ -19 జట్టులో చోటు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, అశీస్సులకు ధన్యవాదాలు. నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ రోజు కోసం నేను ఎంతో కష్ట పడ్డాను’ అని అన్నాడు. ప్రస్తుతం మహారాజా టీ20 లీగ్ (Maharaja T20 League)లో దంచికొడుతున్న జూనియర్ ద్రవిడ్ భారత సీనియర్ టీమ్‌కు ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
🚨 NEWS 🚨
India U19 squad and fixtures announced for multi-format home series against Australia U19.
Squad for one-day series: Rudra Patel (VC) (GCA), Sahil Parakh (MAHCA), Kartikeya KP (KSCA), Mohd Amaan (C) (UPCA), Kiran Chormale (MAHCA), Abhigyan Kundu (WK) (MCA), Harvansh…
— BCCI (@BCCI) August 31, 2024
క్రికెట్ దిగ్గజమైన రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని సుమిత్ పుణికిపుచ్చుకున్నాడు. అయితే.. తండ్రి ఆటకు మనోడి ఆటకు ఎంతో తేడా ఉంది. ద్రవిడ్‌లా నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించడం కంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించడం అంటేనే సమిత్‌కు ఇష్టం. జూనియర్ స్థాయి నుంచి కూడా ఈ యంగ్‌స్టర్ అదే తరహాలో ఆడుతున్నాడు.
ప్రస్తుతం మహారాజా టీ20 ట్రోఫీలో బెంగళూరుకు ఆడుతున్న సమిత్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు కర్ణాటక జట్టు కూచ్‌బెహార్ ట్రోఫీ విజేతగా నిలువడంలో సమిత్ కీలకంగా వ్యవహరించాడు. అండర్ -19 జట్టుకు ఎంపికైన జూనియర్ ద్రవిడ్ పేస్ బౌలర్‌గానూ జట్టుకు ఉపయోగపడనున్నాడు. పుదుచ్చేరి వేదికగా ఈనెల 21, 23, 26 తేదీల్లో ఆసీస్ అండర్ -19 జట్టుతో వన్డే సిరీస్ జరుగనుంది.