Curry leaves : సాధారణంగా కూరల్లో సువాసన కోసం కరివేపాకును వేస్తారు. కానీ ఈ కరివేపాకును తినేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. చాలామంది కూరలో కరివేపాకు కనిపించగానే తినకుండా పక్కకు పెడుతారు. ఎక్కువ మంది ఇలా కరివేపాకును తీసిపారేస్తారు కాబట్టే.. ఎవరినైనా లెక్కచేయకపోతే ‘నన్ను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు’ అంటూ వాపోతారు. కానీ కరివేపాకును పారవేయద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే దానిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పలు సమస్యలకు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి కరివేపాకుతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం..