PAK vs SL : రావల్పిండిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను మూడొందల లోపే కట్టడి చేసిన సంతోషం బంగ్లాకు దక్కలేదు. తొలి సెషన్లో పాక్ పేసర్ ఖుర్రమ్ షెహ్జాద్(6/90) విజృంభణకు బంగ్లా టాపారర్డర్ కుప్పకూలింది. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా లిట్టన్ దాస్(138) మొండిగా పోరాడాడు. మెహిదీ హసన్ మిరాజ్(78)తో కలిసి పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కానీ, అఘా సల్మాన్ అతడిని వెనక్కి పంపాక బంగ్లా ఇన్నింగ్స్ 262 వద్దే ముగిసింది. దాంతో, ఆతిథ్య పాకిస్థాన్‌కు 12 పరుగుల ఆధిక్యం లభించింది.
సిరీస్ విజేతను నిర్ణయించే రెండో టెస్టులో బౌలర్ల ఆధిపత్యం నడుస్తోంది. మూడో రోజు తొలి సెషన్లోనే బంగ్లాకు ఆదిలోనే షాక్. పేసర్ ఖుర్రమ్ హెహ్జాబ్ బుల్లెట్ బంతులతో వణికించి తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత ఓపెనర్ జకీర్ హసన్(1)ని బౌల్డ్ చేసిన ఖుర్రమ్.. 5 పరుగుల వ్యవధిలోనే మరో ఓపెనర్ షద్నమ్ ఇస్లామ్(10)ను దొరబుచ్చుకున్నాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(4)ను బౌల్డ్ చేసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాడు. మరో ఎండ్‌లో మిర్ హమ్జా సైతం చెలరేగగా 26 పరుగులకే బంగ్లా సగం వికెట్లు కోల్పోయింది.
🤝 165-run stand with Mehidy Hasan Miraz
💪 69-run partnership with Hasan MahmudFrom 26/6, Litton Das and the lower order have taken Bangladesh to just 12 runs shy of Pakistan’s total in Rawalpindi 😮 https://t.co/1CSHXUZXFy #PAKvBAN pic.twitter.com/7EUii19DoI
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2024
సగం మంది డగౌట్ చేరనా లిట్టన్ దాస్(138) అధైర్యపడలేదు. దూకుడుగా ఆడుతూ పాక్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేశాడు. మెహిదీ హసన్ మిరాజ్(78)తో కలిసి బంగ్లా స్కోర్ బోర్డును ఉరికించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లిట్టన్ ఆ తర్వాత గేర్ మార్చాడు. పాక్ బౌలింగ్ దళాన్ని చీల్చిచెండాడుతూ శతక గర్జన చేశాడు. అయితే.. ఖుర్రం డేంజరస్ మిరాజ్‌ను ఔట్ చేసి పాక్‌కు బ్రేకిచ్చాడు. దాంతో, వీళ్లిద్దరి165 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత అఘా సంగ్మా సూపర్ బంతితో లిట్టన్‌ను బోల్తా కొట్టించాడు.
Khurram Shahzad FINALLY gets the breakthrough for Pakistan, and picks up his fifth wicket 🔥https://t.co/1CSHXUZpQ0 #PAKvBAN pic.twitter.com/N8eKVdMwo5
— ESPNcricinfo (@ESPNcricinfo) September 1, 2024
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్(5/61) ధాటికి పాకిస్థాన్ 274 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సయూం అయూబ్(58), కెప్టెన్ షాన్ మసూద్(57)లు మంచి పునాది వేసినా.. మిరాజ్ తిప్పేపయడంతో మిగతా వాళ్లు చేతులెత్తేశారు. ఆఖర్లో అఘా సల్మాన్(54) అర్థ శతకంతో పోరాడి పాక్ పరువు కాపాడాడు.