సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయి న జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6,530 కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ. కోటికి పైగా చెల్లింపులు జరుపుతున్నారు. ప్రతి నెలా 1వతేదీ వచ్చిందంటే చాలు జీతభత్యాలు, పెన్షన్లు చెల్లించేందుకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది.
ఈ నేపథ్యంలోనే పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్వీపింగ్ యంత్రాల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కమిషనర్ కర్ణన్.. దాదాపు ఐదు నెలల కిందట స్వీపింగ్ యంత్రాల వినియోగాన్ని రద్దు చేశారు. కార్మికులతో పనిచేయిస్తూ దుబారాకు అడ్డుకట్ట వేశారని చర్చించుకుంటున్న తరుణంలోనే మళ్లీ స్వీపింగ్ యంత్రాలను వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే స్వీపింగ్ యంత్రాలకు టెండర్లకు పిలిచి పనులు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం.
ఏటా రూ.3.56 లక్షల ఖర్చు
గ్రేటర్ హైదరాబాద్‌లో రహదారులపై దుమ్ము, ధూళితో పాటు కాగితాలు, ఇతర చెత్తను తొలగించేందుకు స్వీపింగ్ యంత్రాలను అద్దె ప్రాతిపదికన తీసుకొని వినియోగిస్తుంటారు.దాదాపు 17కి పైగా స్వీపింగ్ యంత్రాల నిర్వహణకు ఏటా రూ. కోట్లలో ఖర్చు చేస్తుంటారు. రహదారుల స్వీపింగ్‌కు ఏటా రూ.63. 40 కోట్ల చొప్పున ఐదేండ్లకు రూ. 317 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏటా కి.మీ 5.55 లక్షలకు పైగా వెచ్చించారు. అయి తే కార్మికుల లెక్కలను పరిశీలిస్తే..గ్రేటర్లో 18వేల మందికిపైగా పారిశుధ్య కార్మికులు ఉన్నారు. 9,103 కిలోమీటర్ల మేర రహదారులపై వీరు నిత్యం స్వీపిం గ్ చేస్తున్నారు. కార్మికులకు నెలకు సు మారు రూ. 27 కోట్ల చొప్పున ఏటా రూ.324 కోట్లకు పైగా వేతనం చెల్లిస్తున్నారు.
అంటే కి.మీ స్వీపింగ్‌కు ఏటా బల్దియా రూ.3.56 లక్షల ఖర్చు చేస్తున్నది. కార్మికుల స్వీపింగ్‌తో పోలిస్తే ఇది రూ.2 లక్షల అదనం. అయితే స్వీపింగ్ యంత్రాల పనితీరు సరిగా లేదని, అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు రావడంతో స్వీపింగ్ యంత్రాలను రద్దు చేశారు. కార్మికులకు ఈ పనులను అప్పగించి ఈ యంత్రాల అవస రం లేకుండా చేసి ఖర్చు భారాన్ని తగ్గించారు. అయితే స్వీపింగ్ యంత్రాల రద్దు పై ఇటీవల కాలంలో మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కమిషనర్‌కు లేఖ రా శారు. స్వీపింగ్ యంత్రాలను కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే క్ర మంలోనే అధికార పార్టీలో కొందరు నే తలు, కాంట్రాక్టర్లు, మజ్లిస్ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే తా జాగా అద్దె స్వీపింగ్ యంత్రాల వినియో గం అనివార్యమన్న దిశగా అధికారులు అడుగులు వేస్తుండడం గమనార్హం.