Nicholas Pooran : వెస్టిండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్(Nicholas Pooran) పొట్టి క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ‘సిక్సర్ల కింగ్’గా పేరొందిన ఈ డాషింగ్ బ్యాటర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL) 2024లో అర్ద శతకంతో చెలరేగాడు. దాంతో, టీ20ల్లో ఒకే ఏడాది అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించాడు. తద్వారా విండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(Chirs Gayle) రికార్డును పూరన్ బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం పూరన్ 139 సిక్సర్లతో టాప్లో ఉండగా.. గేల్ 2015లో 135 సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు.
పొట్టి ఫార్మాట్ అంటే చాలు రెచ్చిపోయే పూరన్ అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన పూరన్.. ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో వంద సిక్సర్ల క్లబ్లో చేరాడు. పేసర్ గస్ అట్కిన్సన్(Gus Atkinson) వేసిన ఐదో ఓవర్లో సిక్సర్ కొట్టిన అతడు ఈ ఫీట్ సాధించాడు. తద్వారా 100 సిక్సర్ల మైలురాయికి చేరిన 16వ క్రికెటర్గా, మూడో కరీబియన్ ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు.
Pooran rocks the pitch with the first half century in Warner Park for CPL 2024. #CPL24 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #CaribbeanAirlines pic.twitter.com/zdL79EGyiq
— CPL T20 (@CPL) September 1, 2024
Most Sixes in a Calendar Year in T20s
139* – Nicholas Pooran (2024)
135 – Chris Gayle (2015)
121 – Chris Gayle (2012)
116 – Chris Gayle (2011)
112 – Chris Gayle (2016)
101 – Chris Gayle (2017)
101 – Andre Russell (2019)
100 – Chris Gayle (2013) pic.twitter.com/vGJKxsXblF— CricTracker (@Cricketracker) September 1, 2024
పూరన్ కంటే ముందు విండీస్ తరఫున యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డాషింగ్ ఓపెనర్ ఎవిన్ లెవిస్(Evin Lewis) టీ20ల్లో 100 సిక్సర్లు బాదారు. లెవిస్ 48 ఇన్నింగ్స్లో, గేల్ 49 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకున్నారు. ఇక భారత జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ ఫీట్ సాధించారు. న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ కొలిన్ మున్రో 57 ఇన్నింగ్స్లో, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్ ఫించ్ 70వ ఇన్నింగ్స్లో 100 సిక్సర్లు బాదారు.