లండన్: బ్రిటిష్ స్కాష్ జూనియర్ ఓపెన్ టోర్నీలో భారత యువ ప్లేయర్ అనాహత్ సింగ్ రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అనాహత్ 1-3 తేడాతో లారెన్ బాల్టన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమైన అనాహత్ వరుస గేముల్లో మ్యాచ్‌ను కోల్పోయింది.
ఇదే అదనుగా మలుచుకున్న లారెన్ సూపర్ షాట్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 2019 నుంచి వివిధ కేటగిరీల్లో చాంపియన్‌గా నిలుస్తూ వస్తున్న అనాహత్ తొలిసారి రన్నరప్ టైటిల్‌కు పరిమితమైంది.