మెల్బోర్న్: సీజన్ తొలిగ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. గతేడాది పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీలో 16శాతం పెంచినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈనెల 18 నుంచి మొదలవుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మొత్తం ప్రైజ్‌మనీ 111.5 ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ.675.86 కోట్లు)గా ప్రకటించారు. ఇందులో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు రూ. 25.17 కోట్ల నగదు ప్రోత్సాహకం దక్కనుంది.