Perni Nani | రెచ్చిపోయిన జనసైనికులు.. పేర్ని నాని కారుపై రాళ్ల దాడి
Perni Nani | కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Perni Nani | కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని ఆదివారం వచ్చారు. నాని రాక గురించి తెలుసుకున్న జన సైనికులు అక్కడికి చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన జన సైనికులు పేర్ని నానిపై కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనతో పేర్ని నాని గుడివాడ నుంచి వెనుదిరిగారు. అదే సమయంలో మరికొందరు కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అప్రమత్తమైన పోలీసులు జన సైనికులను అదుపులోకి తీసుకున్నారు. పలువుర్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. మిగతా జన సైనికులు పోలీసుల వాహనాలకు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు, జనసైనికుల మధ్య వాగ్వాదం నెలకొంది.
గుడివాడ వచ్చిన @perni_nani గారిపై దాడి కి యత్నించిన @JanaSenaParty వాళ్ళు 😟 pic.twitter.com/5z12nihLzB
— Syed Mahaboob Basha (@Smahaboob17) September 1, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

