Rahul Dravid : ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ బోణీ కోసం ఎదురు చేస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. శనివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరగబోయే మ్యాచ్ రాజస్థాన్‌కు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన గురించి ఆందోళన చెందడం లేదని అన్నాడు. అంతేకాదు తాను గాయం నుంచి కోలుకుంటున్న తీరు గురించీ మాట్లాడాడు ది వాల్.
’18వ సీజ న్లో మా జట్టుకు ఆశించిన ఫలితం రావట్లేదు. రెండు మ్యాచ్‌లు ఓడినంత మాత్రాన రాజస్థాన్‌కు పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడే ప్లే ఆఫ్స్ అవకాశాలపై చర్చ అవసరం లేదు. మా టీమ్‌లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మేము 25 నుంచి 30 పరుగులు అదనంగా ఇచ్చాం. ఇక కోల్‌కతాపై మా జట్టు మరో 30 పరుగులు ఎక్కువ చేయాల్సింది.
కానీ, మెగా టోర్నీలో ముందడుగు వేసేందుకు మాకు అవకాశాలు లేకపోలేదు. జట్టుతో పాటు కోచింగ్ సిబ్బంది అందరం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇక నా కాలికి గాయం విషయానికొస్తే.. వేగంగానే కోలుకుంటున్నా. వైద్య సిబ్బంది, సహచరులు ఎంతో సహకరిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాకు 52 ఏళ్లు. బహుశా ఈ వయసులో నేను క్రికెట్ ఆడడం సరికాదేమో’ అని జోక్ చేశాడు ద్రవిడ్.
18వ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులో క్రికెట్ ఆడుతుండగా ద్రవిడ్ ఎడమ కాలికి గాయమైంది. దాంతో, ఇప్పటికీ అతడు కర్రల సాయంతోనే నడుస్తున్నాడు. జట్టుతో కలిసిన ద్రవిడ్ చక్రాల కుర్చీలో కూర్చొని మైదానంలో తిరుగుతూ తమ జట్టు కెప్టెన్, ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్నాడీ లెజెండ్. ఓవైపు కాలి గాయం వేధిస్తున్నా సరే.. జట్టు ప్రయోజనమో తనకు ముఖ్యం అంటున్న ద్రవిడ్ అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు క్రీడాభిమానులు.
Rahul Dravid inspecting the pitch on the wheelchair.#RRvsCSK #RRvCSK #tataipl2025 pic.twitter.com/merjxpxxXs
— Cricket lover (@harty_sa) March 30, 2025