వెంగళరావునగర్, మార్చి 30 : ఎస్సై జాబ్‌కు ప్రిపేర్ అవుతున్నా.. తొందరలోనే ఉద్యోగం వస్తుంది.. అప్పటిదాకా పెండ్లికి తొందరపెట్టకు.. కొంచెం ఓపిక పట్టు అని నమ్మించాడో యువకుడు. నిన్నే పెండ్లాడుతా అని చెప్పి తన కోరికను తీర్చుకున్నాడు. దాదాపు ఎనిమిదేండ్లు ప్రేమాయణం తర్వాత ఇప్పుడు పెండ్లి చేసుకోనని మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో నివాసం ఉండే ఓ యువతి(29) సినిమాల్లో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలో చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలి ద్వారా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన భూక్యా వినోద్‌కుమార్ (30) పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీంతో వినోద్ ప్రేమను సదరు యువతి అంగీకరించింది. దీంతో పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో తన కోరికలు తీర్చుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఆమెతో ప్రేమాయణం నడిపించారు. ఈ క్రమంలో సదరు యువతి పెళ్లి చేసుకోమని అడగడడంతో.. ఎస్సై పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా.. టెన్షన్ పడకు.. నిన్నే పెండ్లి చేసుకుంటానని కొద్దిరోజులు బుకాయించాడు. కోరిక తీరిన తర్వాత ఆమె నుంచి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు.
తనను వినోద్ మోసం చేస్తున్నాడని గ్రహించిన సదరు యువతి.. ప్రియుడి స్వగ్రామమైన గార్ల గ్రామానికి వెళ్లింది. అతని తండ్రి భూక్యా మంగీలాల్, తమ్ముడు అశోక్‌లను నిలదీసింది. దీంతో వినోద్‌తో పెండ్లి జరిపిస్తామని నచ్చజెప్పి.. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా వెనక్కి వెళ్లేలా చేశారు. ఫిబ్రవరిలో ఇది జరగ్గా.. ఇప్పటికీ పెండ్లిపై ఎలాంటి స్పందన లేదు. దీంతో వినోద్‌ను నిలదీయగా.. ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదు.. నిన్ను పెండ్లి చేసుకోనని తేల్చిచెప్పేశాడు. దీంతో సదరు యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో వినోద్‌పై ఫిర్యాదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.