PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 30(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు-2025 ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో ఆదివారం జరిగిన ఉగాది పురస్కారాలకు అఖిల భారత యాదవ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు శ్రీహరి, జేకే యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని యాదవ ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు.
సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న నిష్ణాతులను గౌరవించుకునే విధంగా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందచేస్తున్నామని ఇందులో భాగంగా ఈ ఏడాది దృశ్య ప్రసార మాధ్యమం విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కాల్వ రమేష్ యాదవ్ కు ఉగాది పురస్కారం-2025 ప్రదానం చేసి సత్కరించిన్నట్లు యాదవ చారిటబుల్ ట్రస్ట్ అద్యక్షుడు మారం తిరుపతి తెలిపారు.
పురస్కారాల్లో బాగంగా తొలుత శ్రీకృష్ణ పూజ, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, బక్ష్చాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లాలోని యాదవ కుల బాందవులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ్ కుమార్ యాదవ్, చిలారపు పర్వతాలు యాదవ్, మంద భాస్కర్ యాదవ్, రాజేష్, పలువురికి జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి కృతఙ్ఞతలు తెలిపారు.
-2025 under the auspices of Yadava Charitable Trust