Bangkok Pilla | భారీ భూకంపం రెండు దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు నమోదైన ప్రకంపనలకు మయన్మార్, దాని పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వణికిపోయాయి.. భారీగా వచ్చిన భూ ప్రకంపనలకు భారీ భవనాలు కూడా కుప్పకూలాయి. దీంతో బ్యాంకాక్‌లో పరిస్థితి ఇప్పుడు భయానకంగా మారింది. ఎటు చూసిన కూలిన భవనాల శిథిలాలే కనిపిస్తున్నాయి. 1600కి పైగా మృతి చెందారని అంటున్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బ్యాంకాక్‌లో ఓ ఆసుపత్రిని ఖాళీ చేయించారు.. భూకంప భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీసారు.
భూకంపాల కారణంగా మయన్మార్, బ్యాంకాక్, థాయిల్యాండ్ దేశాల్లో ఉన్న భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో ప్రముఖ యూట్యూబర్, బ్యాంకాక్ పిల్ల కూడా ఉంది. ఈమె అసలు పేరు శ్రావణి వర్మ సామంత పూడి కాగా, బ్యాంకాక్ పిల్లగా అందరికి దగ్గరైంది. భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ వెళ్లి అక్కడే స్థిర పడిన శ్రావణి యూట్యూబ్ ద్వారా అక్కడి సంగతులని మన ఇండియన్స్‌కి తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా భూకంపం ధాటికి వారు ఎంత భయపడ్డారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే విషయాలని యూట్యూబ్ ద్వారా తెలియజేసింది.
బ్యాంకాక్ పిల్ల కుటుంబం ఉంటున్న అపార్టమెంట్ కూడా భూకంపం వలన నేల మట్టం అయిందని చెప్పుకొచ్చింది. జనాలందరు భయంతో పరుగులు తీసారట. తన కుమారుడి స్కూల్ 24వ ఫ్లోర్ లో ఉండగా, అతడు క్షేమంగా బయటకు వచ్చాడని, భూకంపంతో అందరం చాలా భయపడ్డామని వీడియోలో తెలియజేసింది. కాళ్లకి చెప్పులు కూడా లేకుండా భయంతోనే కిందకి వచ్చేసి అక్కడి పరిస్థితులని వీడియో తీసి తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె యూట్యూబ్ ఛానెల్ కు సుమారు 20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతంలో ఆమె తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొంటుందని ప్రచారం జరిగిన అవి రూమర్లు గానే మిగిలిపోయాయి.