Rahul Dravid: బీసీసీఐ కీలక నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులు పొడిగింపు
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలు మోస్తున్న హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ తో పాటు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్న ఆశిష్ నెహ్రాలను గానీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి.
Rahul Dravid: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ముగిసిన టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును పునరుద్ధరించింది. ద్రావిడ్‌తో పాటు గత రెండేండ్లుగా ఉన్న కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలు సారథి, హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రోహిత్, ద్రావిడ్‌ను నియమించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి వన్డే ప్రపంచకప్ తర్వాత ద్రావిడ్ రెండేండ్ల కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో భారత్ కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు చేసింది. రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలు మోస్తున్న హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ తో పాటు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్న ఆశిష్ నెహ్రాలను గానీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ ఇద్దరూ కాకుంటే విదేశీ కోచ్‌ల వైపు కూడా చూడొచ్చన్న వాదనలు వచ్చాయి. కానీ వీవీఎస్‌కు ఇప్పటికే ఎన్సీఏ బాధ్యతలు ఉండగా నెహ్రా కూడా ఐపీఎల్‌తో పాటు ఇతర బాధ్యతల కారణంగా హెడ్‌కోచ్ పదవికి విముఖత చూపించడంతో ద్రావిడ్‌నే కొనసాగించేందుకు అతడిని ఒప్పించినట్టు సమాచారం. ద్రావిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌ల కాంట్రాక్టు కూడా పొడిగించింది.
NEWS 🚨 -BCCI announces extension of contracts for Head Coach and Support Staff, Team India (Senior Men)
More details here – https://t.co/rtLoyCIEmi #TeamIndia
— BCCI (@BCCI) November 29, 2023
ద్రావిడ్ పదవీకాలం పొడిగించినా అతడిని ఎంతవరకు ఆ పదవిలో కొనసాగిస్తారు..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. అసలు గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిశాక భారత్ ఆడిన టీ20 మ్యాచ్‌లలో దాదాపు అన్నీ లక్ష్మణ్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక, న్యూజిలాండ్ టూర్లకు మాత్రమే ద్రావిడ్ కోచ్‌గా ఉన్నాడు. అతడు ఎక్కువగా వన్డేలు, టెస్టులకే పరిమితమయ్యాడు. ద్రావిడ్‌ను వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగిస్తారని బోర్డు వర్గాల వినికిడి. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత్ కూడా మహా అయితే ఆడేది ఆరు టీ20 మ్యాచ్‌లే. మరి ద్రావిడ్ మార్గదర్శకత్వంలోనే భారత్ మరో ప్రపంచకప్‌కు సిద్ధమవుతుందా..? లేక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా అతడిని తీసుకున్నారా..? అనేది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

