IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్. ఓపెనర షాన్ మార్ష్(81) విధ్వంసానికి నికోలస్ పూరన్(87 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో కొండంత స్కోర్ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్నే విజయం వరించింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆద్యంత ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో 4 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జయభేరి మోగించింది.
239 పరుగుల ఛేదనలో కెప్టెన్ అజింక్యా రహానే(61), వెంకటేశ్ అయ్యర్(45)ల జోరుతో 163-3తో పటిష్ట స్థితిలో నిలిచింది కోల్‌కతా. అయితే.. శార్ధూల్ ఠాకూర్(2-52), అవేశ్ ఖాన్ల విజృంభణతో వరుసగా వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్(38 నాటౌట్) మెరుపులతో గెలుపు వాకిట నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ 234కే పరిమితమైంది. రవి బిష్ణోయ్ వేసిన 20వ ఓవర్లో రింకూ 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. సొంత గడ్డపై వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది కోల్‌కతా.
Worked his magic again 🎩
Shardul Thakur got the HUGE wicket of Andre Russell 👏
David Miller with an impressive catch 👌
Was this the turning point of the match?
Scorecard ▶ https://t.co/3bQPKnxnJs#TATAIPL | #KKRvLSG | @imShard pic.twitter.com/GlWY35nRel
— IndianPremierLeague (@IPL) April 8, 2025
సొంత మైదానంలో భారీ ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివరిదాకా పోరాడింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(15) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా కెప్టెన్ అజింక్యా రహానే(61)తో కలిసి సునీల్ నరైన్(30) బౌండరీలతో చెలరేగాడు. రెండో వికెట్‌కు 60 రన్స్ జోడించాడు. ప్రమాదకరంగా మారిన ఈ డాషింగ్ ఓపెనర్‌ను మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్(45), రహానే ధాటిగా ఆడడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది ఆతిథ్య ట్టు. విజయానికి చేరువైన దశలో శార్ధూల్ ఠాకూర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 5 వైడ్స్ వేసిన అతడు ఆఖరి బంతికి రహేనేను ఔట్ చేసి కోల్‌కతాకు షాకిచ్చాడు.
You gave it your all 💜 pic.twitter.com/ij6yDYotFC
— KolkataKnightRiders (@KKRiders) April 8, 2025
రహానే ఔటయ్యే సరికి కోల్‌కతా విజయానికి 77 పరుగుల అవసర కాగా.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రమన్‌దీప్ సింగ్(1)ను రవి బిష్ణోయ్ డగౌట్‌కు పంపాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ(5) ఒక బౌండరీ బాది ఉసూరుమనిపించాడు. ఆ తర్వాత.. కాసేపటికే వెంకటేశ్ అయ్యర్(45) ఔటయ్యాడు. శార్ధూల్ బౌలింగ్‌లో ఆండ్రూ రస్సెల్(7) పెద్ద షాట్ ఆడే క్రమంలో మర్క్రమ్ చేతికి చిక్కాడు. దాంతో, 185కే కోల్‌కతా 7 వికెట్లు పడ్డాయి. ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరడంతో గెలుపు భారం రింకూ సింగ్(38 నాటౌట్)పై పడింది… హర్షిత్ రానా (10 నాటౌట్).. దిగ్వేశ్ రథీ ఓవర్లో రంకూ ఒక బౌండరీ సంధించగా కోల్‌కతా స్కోర్ 200లకు చేరింది. అవేశ్ ఖాన్ వేసిన19వ ఓవర్లో లెగ్ సైడ్ బంతిని స్టాండ్స్‌లోకి పంపిన రింకూ.. ఇంకో రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా.. హర్సిత్ తొలి బంతికి బౌండరీ సాధించాడు. నాలుగు, ఐదు బంతుల్ని రింకూ బౌండరీకి తరలించి.. ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 4 పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి పాలైంది.
ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈడెన్ గార్డెన్స్‌లో తమ విధ్వంసంతో కొండంత స్కోర్ అందించారు. మొదట ఓపెనర్ షాన్ మార్ష్(81) సైతం తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్(87 నాటౌట్) పట్టపగలే కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడిగు అర్ధ శతకంతో గర్జించాడు. రస్సెల్ వేసిన 18వ ఓవర్లో 4, 4, 6, 4, 6 బాదిన ఈ చిచ్చర పిడుగు 24 పరుగులు పిండుకున్నాడు. దాంతో, లక్నో స్కోర్ 200 దాటింది. పూరన్ మెరుపులతో ఆఖరి ఐదు ఓవర్లలో 86 పరుగులు రాబట్టింది. వీళ్లిద్దరి విధ్వంసక బ్యాటింగ్ ఫలితంగా కోల్‌కతా కంచుకోటలో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
Thorough entertainment at the Eden Gardens 🏟 🍿
And it’s the Rishabh Pant-led @LucknowIPL that prevail in a thrilling run fest 🥳
They bag 2️⃣ crucial points with a 4️⃣-run victory over #KKR 👏
Scorecard ▶ https://t.co/3bQPKnxnJs#TATAIPL | #KKRvLSG pic.twitter.com/31clVQk1dD
— IndianPremierLeague (@IPL) April 8, 2025