శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు దర్శకులకు అవార్డులు
Sriram International Film Festival | శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (అయోధ్య)లో తెలుగు దర్శకులు నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నారు.
Sriram International Film Festival | శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (అయోధ్య)లో తెలుగు దర్శకులు నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నారు. గత 3 సంవత్సరాల నుండి అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ, యువ దర్శకుడు కృష్ణ ఎస్ రామ అవార్డులు సొంతం చేసుకున్నారు.
ఈ సందర్బంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ.. నాలుగు అవార్డులు రావడం చాలా ఆనందదాయకం అని పేర్కొన్నారు. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమన్నారు. రామ అయోధ్య ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. తన మొదటి చిత్రానికే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడం గొప్పగా భావిస్తున్నానని చెప్పారు.
రామ అయోధ్య ఫిల్మ్ 2024 ఏప్రిల్ 17న ఆహా తెలుగు OTTలో విడుదలై మంచిపేరు సంపాదించింది. శ్రీమాన్ రామ దూరదర్శన్ నేషనల్ టీవీలో 2024లో విడుదలై ఇప్పటికీ కొనసాగుతూ నెంబర్ -1 టీవీ షోగా రికార్డు సృష్టించింది.
అవార్డ్స్
1. బెస్ట్ డైరెక్టర్ (ఏనిమేషన్) – సత్యకాశీ భార్గవ (శ్రీమాన్ రామ )
2. బెస్ట్ కార్టూన్ ఏనిమేషన్ ఫిల్మ్ – శ్రీమాన్ రామ
3. బెస్ట్ మైథలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ – కృష్ణ ఎస్ రామ (రామ అయోధ్య)
4. బెస్ట్ కల్చరల్ స్టోరీ కాన్సెప్ట్ – సత్యకాశీ భార్గవ (రామ అయోధ్య)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

