IPL 2025 : ఊహించినట్టే ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 174 రన్స్ కొట్టింది. కెప్టెన్ అజింక్యా రహానే(56), సునీల్ నరైన్(44)ల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఒకదశలో వీళ్లిద్దరి మెరుపులతో 200 కొట్టేలా కనిపించిన కోల్‌కతాను ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా(3/29), హేజిల్‌వుడ్(2/22)లు 180లోపే కట్టడి చేశారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి కప్పు కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు విజయంతో టోర్నీ ఆరంభించేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదేమో.
ఆరంభ వేడుకల అనంతరం టాస్ గెలిచిన ఆర్సీబీ.. అజింక్యా రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. హేజిల్‌వుడ్ వేసిన తొలి రెండో బంతినే బౌండరీకి పంపి డికాక్ ప్రమాదకరంగా కనిపించాడు. అయితే.. హేజిల్‌వుడ్ ఊరించే బంతితో అతడిని కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చేలా చేశాడు. దాంతో, కోల్‌కతా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్యా రహానే(56), కాసేపు ఆచితూచి ఆడినా .. 4 ఓవర్లో బ్యాట్ ఝులిపించాడు. రసిక్ దారు వేసిన ఆ ఓ ఓవర్లో రెచ్చిపోయిన అతడు 4, 6, 6 బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు.
First match as #KKR captain ✅
First fifty of the season ✅Ajinkya Rahane continues to make merry 👌
Updates ▶ https://t.co/C9xIFpQDTn#TATAIPL | #KKRvRCB | @KKRiders pic.twitter.com/aeJUNEF9Bs
— IndianPremierLeague (@IPL) March 22, 2025
మరోవైపు నరైన్ సైతం తగ్గేదేలే అన్నట్టు దంచికొట్టాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగగా స్కోర్‌బోర్డు పరుగులు పెట్టింది. రెండో వికెట్‌కు 103 పరుగుల జోడించిన వీళ్లను రసిక్ సలాం విడదీశాడు. అర్థ శతకం దిశగా దూసుకెళ్తున్న నరైన్‌ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే దంచికొడుతున్న రహానేకు చెక్ పెట్టిన కృనాల్ పాండ్యా వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్(6)ను బౌల్డ్ చేసి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. అక్కడితో 145కే నాలుగు వికెట్లు పడడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ స్లో అయింది.
రహానే, నరైన్‌లు ఔటయ్యాక కోల్‌కతా స్కోర్ వేగం తగ్గింది. డేంజరస్ రింకూ సింగ్(), ఆండ్రూ రస్సెల్()లు విఫలమవ్వగా యువకెరటం అంగ్కృష్ రఘువంశీ() జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. పెద్ద షాట్లు ఆడిన అతడు.. హేజిల్‌వుడ్ ఓవర్లో సిక్సర్ బాది స్కోర్ 160 దాటించాడు. అయితే.. ధాటిగా ఆడే క్రమంలో వికెట్ కీపర్ జితేశ్ చేతికి చిక్కాడు రఘువంశీ. అతడు ఔటయ్యాక కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 రన్స్‌కే పరిమితమైంది.
Innings Break!#RCB with a strong comeback after #KKR started well 👏👏
Who is winning the season opener – 💜 or ❤️
Chase on the other side ⌛️
Scorecard ▶ https://t.co/C9xIFpQDTn#TATAIPL | #KKRvRCB | @KKRiders | @RCBTweets pic.twitter.com/mu4Ws78ddA
— IndianPremierLeague (@IPL) March 22, 2025