భోపాల్: మిస్టరీ మహిళ అర్ధరాత్రి వేళ వీధుల్లో సంచరిస్తున్నది. పలు ఇళ్ల డోర్బెల్స్ మోగిస్తున్నది. (Woman Rings Doorbells At Midnight) ముసుగు వేసుకున్న ఆ మహిళను చూసి పశువులు కూడా పారిపోతున్నాయి. ఇది తెలిసి జనం భయపడిపోతున్నారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. మార్చి 19న అర్ధరాత్రి వేళ ముసుగు వేసుకున్న ఒక మహిళ వీధుల్లో సంచరించింది. పలు ఇళ్ల వద్ద డోర్ బెల్స్ మోగించింది. కొందరు స్పందించి ఎవరిని అడిగినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ వీధిలోని పశువులు కూడా ఆ మహిళను చూసి భయంతో పారిపోయాయి. ఆమెను చూసిన కొందరు జడుసుకుని అనారోగ్యం పాలయ్యారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది తెలిసి ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ మిస్టరీ మహిళ గురించి నిజం ఏమిటో తాము తేలుస్తామని, ఎవరూ భయాందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు. అయితే ఫ్రాంక్ కోసం ఎవరో ఇలా ప్రయత్నించినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
ग्वालियर में आधी रात कोे घर की घंटी बजाने आ रही स्त्री, लोगों में डर का महौल, सोशल मीडिया पर वीडियो वायरल#MadhyaPradesh #MPNews #Gwalior #Viral #Stree #VistaarNews pic.twitter.com/LpBqEjPct6
— Vistaar News (@VistaarNews) March 22, 2025
#WATCH | MP: Mysterious Woman Caught Ringing Bell Of Residences Late Night In Gwalior#MadhyaPradesh #gwalior #MPNews pic.twitter.com/ruJ2F6P8BZ
— Free Press Madhya Pradesh (@FreePressMP) March 22, 2025