IPL 2025 : ప్లే ఆఫ్స్ పోరులో వెనకబడిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కీలకపోరులో భారీ స్కోర్ చేసింది. సమిష్టిగా రాణించిన కోల్‌కతా బ్యాటర్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 200 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మిడిలార్డర్ విఫలమైనా యువకెరటం అంగ్క్రిష్ రఘువంశీ(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్యా రహానే(26), రింకూ సింగ్ (36)లతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. వరుస విరామాల్లో వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్లకు కోల్‌కతా హిట్టర్లకు ముకుతాడు వేశారు. డెత్ ఓవర్లలో ఆండ్రూ రస్సెల్(17) చెలరేగి ఆడడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను దంచేస్తూ సునీల్ నరైన్(27), రహ్మనుల్లా గుర్బాజ్(26)లు దూకుడుగా ఆడారు. దాంతో, పవర్ ప్లేలో రన్స్ చేసింది. కోల్‌కతా భారీ స్కోర్‌కు బాటలు వేస్తున్న ఈ జోడీని విడదీసిన మిచెల్ స్టార్క్(3-43) ఢిల్లీకి తొలి బ్రేకిచ్చాడు. గుర్బాజ్ ఔటైన 27 పరుగులకు విప్రజ్ నిగమ్ ఓవర్లో నరైన్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే(26), అంగ్క్రిష్ రఘువంశీ(44)లు ధాటిగా ఆడారు. అయితే.. అక్షర్ పటేల్(2-27) సూపర్ డెలివరీతో రహానేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సీజన్లో పెద్దగా ఫామ్‌లోలేని వెంకటేశ్ అయ్యర్(7)ను ఔట్ చేసిన అక్షర్ కోల్‌కతాను కష్టాల్లోకి నెట్టాడు.
Into the act straight away 😎
Captain Axar Patel is leading #DC‘s roar 🔥
Updates ▶ https://t.co/saNudbWaXT #TATAIPL | #DCvKKR | @akshar2026 pic.twitter.com/sH0Ln5dKQd
— IndianPremierLeague (@IPL) April 29, 2025
రహానే, వెంకటేశ్‌లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరడంతో రఘువంశీ బాధ్యతగా ఆడాడు. బౌండరీలతో చెలరేగి జట్టు స్కోర్ 150 దాటించాడు. అర్ధ శతకానికి చేరువైన అతడిని చమీర వెనక్కి పంపాడు. 18వ ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్(32)ను విప్రజ్ పెవిలియన్ పంపి కోల్‌కతాను షాకిచ్చాడు. రింకూ సిక్సర్‌గా కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద స్టార్క్ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, కోల్‌కతా ఆరో వికెట్ పడింది. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్(17), రొవ్మన్ పావెల్(5)లు ధనాధన్ ఆడారు. చమీర ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు రస్సెల్. స్టార్క్ వేసిన 20వ ఓవర్లో రస్సెల్ తొలి బంతినే సిక్సర్‌గా మలవడంతో కోల్‌కతా స్కోర్ 200ల మార్క్ చేరింది. అయితే.. మూడో బంతికే పావెల్ ఎల్బీగా ఔట్ కాగా.. అనుకుల్ రాయ్(0)ని చమీర డైవింగ్ క్యాచ్‌తో డగౌట్‌కు పంపాడు. ఐదో బంతికి రస్సెల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే.. స్టార్క్ హ్యాట్రిక్ మిస్ కాగా కోల్‌కతా 204కే పరిమితమైంది.