Justice BR Gavai | సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం
Justice BR Gavai | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్ గవాయ్‌ని కొలిజీయం ఇటీవల తర్వాతి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును ప్రతిపాదించింది.
Justice BR Gavai | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్ గవాయ్‌ని కొలిజీయం ఇటీవల తర్వాతి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొలీజియం సిఫారసులకు ఆమోదముద్ర వేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ఆరు నెలల పాటు సీజేఐగా పని చేయనున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దేశంలోని రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఘనత సాధించారు. ఇంతకు ముందు ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ 2007 నుంచి 2010 వరకు సీజేఐగా సేవలందించారు.
జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. జస్టిస్ గవాయ్ తండ్రి దివంగత ఆర్ఎస్ గవాయ్ సైతం ప్రముఖ సామాజిక కార్యకర్త. బీహార్-కేరళ మాజీ గవర్నర్‌గా పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985 న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగపూర్ బెంచ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియామకమయ్యారు.
జస్టిస్ గవాయ్ 2003లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబయి, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీ బెంచ్‌లలో 15 సంవత్సరాలు పనిచేశారు. 2016లో నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన బెంచ్‌లోనూ జస్టిస్ బీఆర్ గవాయ్ సైతం ఉన్నారు. అలాగే, బుల్డోజర్ చర్యకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులో జస్టిస్ గవాయ్ ఒకరు. ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించి తీర్పు వెలువరించిన ధర్మాసనంలోనూ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

