Rafael Nadal : రఫెల్ నాదల్.. టెన్నిస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఇది. టీనేజ్ సంచలనంగా దూసుకొచ్చి.. లెజెండ్ ఆఫ్ టెన్నిస్గా రిటైర్ అయిన నాదల్ కీర్తి అజరామరం. స్పెయిన్ బుల్గా ఫ్యాన్స్‌ను అలరించిన అతడు.. తనకు ప్రాణమైన ఆటకు అల్విదా పలికి ఆరు నెలలు దాటింది. ఈమధ్యే ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2025) టోర్నమెంట్ ఆరంభ వేడులకు రఫా హాజరయ్యాడు. తన పేరిట ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాలును రిబ్బన్ కత్తిరించి ప్రారంభించాడు. అనంతరం ఈ దిగ్గజ ఆటగాడు మాట్లాడుతూ.. వీడ్కోలు తర్వాతి జీవితం ప్రశాంతంగా ఉందని చెప్పాడు.
మట్టికోట వీరుడు అయిన నాదల్ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమం (Tribute Ceremony) జరిపారు ఫ్రెంచ్ ఓపెనర్ నిర్వాహకులు. ఈ సందర్భంగా కోర్టులో అడుగుపెట్టి.. అశేష ప్రేక్షకులకు అభివాదం చేసిన నాదల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో ఆడిన.. తనకు సవాల్ విసిరిన ఫెదరర్, జకోవిచ్, ఆండీ ముర్రేలతో కలిసి ఫొటో దిగిన రఫా వీడ్కోలు తర్వాతి జీవితం ఎలా ఉందో వివరించాడు.
Merci, @rolandgarros! I will never forget this amazing day! 🥹 pic.twitter.com/cHerLKY7rP
— Rafa Nadal (@RafaelNadal) May 25, 2025
‘నేను వీడ్కోలు పలికి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటికీ నేను రాకెట్ ముట్టలేదు. అయితే.. నేను ఇకపై సరదాగా గోల్ఫ్ ఆడినా సరే జయాపజయాలను పట్టించుకోను. నేను బాగా ఆడానా?.. లేదా? అనే విషయాలు ఆలోచించను. ఈ మనస్తత్వమే నేను 20 ఏళ్ల టెన్నిస్‌లో రికార్డులు నెలకొల్పడంలో తోడ్పడింది. రిటైర్మెంట్ సమయంలోనే మళ్లీ కోర్టులో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నా. అందుకే.. ఎక్కడా టెన్నిస్ ఆడుతూ ఎవరికంట పడలేదు. వీడ్కోలు తర్వాతి జీవితాన్ని నాకు నచ్చినట్టు ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే.. కోర్టులో ఉన్నప్పటిలా ఒత్తిడి ఇప్పుడు నాకు ఉండదు. పైగా నేను టెన్నిస్ కోసం చేయగలిగినంతా చేశాను.
Thank you guys. From the bottom of my heart 😘
🙌🏻 @rogerfederer @DjokerNole @andy_murray pic.twitter.com/LrTHOooODA
— Rafa Nadal (@RafaelNadal) May 26, 2025
సో.. ఇప్పుడు టెన్నిస్ కోర్టును మిస్ అవుతున్నట్టు అనిపించడం లేదు. ప్రస్తుతం నా శరీరం మళ్లీ రాకెట్ పట్టి.. ఆడేందుకు సహకరించదు. అంతేకాదు నేను సాధించిన రికార్డులను చూసి గర్వపడుతాను. కానీ, నేనే గొప్ప ఆటగాడినని మాత్రం అనుకోను. ఎందుకంటే.. ఏదో ఒకరోజు మరొకరు నన్ను దాటేసే అవకాశం ఉంది. కాబట్టి.. టెన్నిస్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా కూల్‌గా ఉంటున్నా. ప్రశాంతంగా జీవిస్తున్నా. నా భార్య, రెండేళ్ల కుమారుడితో రిలాక్స్ లైఫ్‌ను గడిపేస్తున్నా’ అని నాదల్ వెల్లడించాడు.
For ever ♾️#rolandgarros @RafaelNadal pic.twitter.com/skunCinjtE
— Roland-Garros (@rolandgarros) May 25, 2025
పురుషుల టెన్నిస్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన నాదల్కు మట్టి కోర్టు అంటే మోజు. ఎర్రమట్టిపై బుల్ మాదిరిగా రెచ్చిపోయి ఆడే అతడు.. ఇక్కడే ఏకంగా 14 టైటిళ్లు కొల్లగొట్టాడు. అందుకే.. ‘క్లే కోర్ట్ కింగ్’గా పేరొందాడు నాదల్. నిరుడు డేవిస్ కప్(Davis Cup)లో ఓటమితో.. నవంబర్ 19న రిటైర్మెంట్ పలికిన నాదల్.. తన పేరుతో స్పెయిన్‌లో టెన్నిస్ ఆకాడమీ నడుపుతున్నాడు. అక్కడ యువతకు మెలకువలు నేర్పిస్తూ వాళ్లను భావి టెన్నిస్ తారలుగా తీర్చిదిద్దే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
— Rafa Nadal (@RafaelNadal) May 19, 2025