Rajya Sabha Elections : రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) కు వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Centrel Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. అసోం (Assam) లో రెండు, తమిళనాడు (Tamil Nadu) లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.
అసోంలో రాజ్యసభ సభ్యులు రంజన్ దాస్, బీరేంద్ర ప్రసాద్ బైస్యల పదవీకాలం జూన్ 14న ముగియనుంది. అదేవిధంగా తమిళనాడులో ఆరుగురు సభ్యులు అన్బుమణి రామదాస్, ఎం షణ్ముగం, ఎన్ చంద్రశేగరన్, ఎం మహ్మద్ అబ్దుల్లా, పీ విల్సన్, వైకో జూలై 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన జూన్ 2న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
నామినేషన్ల దాఖలుకు జూన్ 9 వరకు గడువు ఇవ్వనున్నారు. జూన్ 10 నామినేషన్ల స్క్రూటినీ నిర్వహించనున్నారు. అభ్యర్థిత్వాన్ని వదులుకోవడానికి తుది గడువు జూన్ 12. జూన్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 23తో ఈ రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.